Site icon HashtagU Telugu

Satyavathi Rathod : పార్టీ మార్పుపై స్పందించిన సత్యవతిరాథోడ్

satyavathi rathod reacts to the change of party

satyavathi rathod reacts to the change of party

Satyavathi Rathod: బీఆర్ఎస్(brs) నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీకి చేయిస్తూ కాంగ్రెస్‌(Congress)లో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు నేతలు కూడా క్యూలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై మాజీమంత్రి గంగుల కమలాకర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. తాను పార్టీని వీడడం లేదని, అదంతా తప్పుడు ప్రచారమని తేల్చి చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Satyavathi Rathod) పేరు వినిపిస్తోంది. ఆమె కూడా త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్టు ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆమె కూడా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. పార్టీ వీడుతున్న నేతలపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు తమ స్వార్థం కోసం పార్టీ మారుతున్నారని విమర్శించారు. తాను మాత్రం అలా చేయాలనుకోవడం లేదని స్పష్టం చేశారు.

Read Also: Taapsee: సినిమాలపై కంటే వ్యక్తిగత జీవితంపై ఎక్కువ ఫోకస్ చేస్తాను: తాప్సీ

ఎన్నికల్లో ఓడిన తనను కేసీఆర్ ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన మూడోసారి సీఎం కావాలని చెప్పులు కూడా వేసుకోకుండా పాదయాత్ర చేశానని గుర్తుచేశారు. కేసీఆర్ పేరును పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నానని తెలిపారు. అలాంటి తాను పార్టీ ఎందుకు మారుతానని ప్రశ్నించారు. కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటనే ఉంటానని సత్యవతిరాథోడ్ తేల్చి చెప్పారు.