Site icon HashtagU Telugu

TRS Sarpanch Suspended: వికలాంగుడ్ని తన్నిన సర్పంచ్ సస్పెండ్!

Surpanch

Surpanch

ఆయనో సర్పంచ్.. బాధ్యయుతంగా ఉండాల్సిన పౌరుడు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి. ప్రజల కోసం పనిచేయాల్సిన అలాంటి వ్యక్తి ఓ వికలాంగుడ్ని దారుణంగా తన్ని అవమానించాడు. తన జీతాన్ని అడిగిన పాపానికి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినందుకుగాను సర్పంచ్ వికలాంగుడి ఛాతిపై దారుణంగా తన్నాడు. అక్కడితో ఆగకుండా ఘోరంగా అవమానించాడు.

ఈ ఘటన మహబూబ్‌నగర్‌ హన్వాడ మండలం పులుపోనిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. ఎన్‌ఆర్‌ఇజిఎస్ వర్కర్‌గా పనిచేస్తున్న కృష్ణయ్య జీతం ఇవ్వాలని సర్పంచ్ కోస్గి శ్రీనివాసులును అడిగాడు. అయితే సర్పంచ్ జీతం ఇవ్వాల్సిందిపోయి, ఆ వికలాంగుడిని దుర్భాషలాడాడు. సర్పంచ్‌ బారి నుంచి తండ్రిని కాపాడేందుకు బాధితురాలి కుమారుడు ప్రయత్నించినా తిడుతూ ఛాతిపై తన్నడం మొదలుపెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహబూబ్‌నగర్ కలెక్టర్ ఎస్ వెంకటరావు సర్పంచ్‌ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.