Sarpanch Elections In Telangana: మరో నెలన్నర రోజుల్లో స్థానిక సంస్థల సమరంతో తెలంగాణ (Sarpanch Elections In Telangana) వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా.. ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేతతోపాటు రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపై వేగం పెంచినట్లు సమాచారం. జనవరి 14న నోటిఫికేషన్ విడుదల చేసి.. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
పంచాయితీ రాజ్ శాఖలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకొనే ఆలోచనలో ఉంది. మినిమం ఐదుగురు ఎంపీటీసీలతో ఒక ఎంపీపీ ఏర్పాటు అయ్యే విధంగా ప్రభుత్వం సవరణ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం కొన్ని మండలాల్లో ముగ్గురు ఎంపిటీసీలతోనే ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్ ఉండే విధంగా చర్యలు తీసుకోనుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీపీ బిల్లును ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం? ఉంది. పంచాయితీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. జనవరి 14వ తేదీన సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండగా.. మొత్తం మూడు దశలలో పంచాయితీ ఎన్నికలు నిర్వహణ జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Also Read: Telangana SSC Exams 2025: పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు.. ఇకపై అవి ఉండవు!
అయితే సమగ్ర కుటుంబ సర్వే తర్వాత ఎన్నికల నిర్వహణపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు సర్పంచ్ ఎన్నికలను రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందన్న అనుమానాల నేపథ్యంలో ఈ సర్పంచ్ ఎన్నికలను ప్రభుత్వం సిరీయస్‌గా తీసుకున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే రేవంత్ సర్కార్ అన్ని పంచాయితీలను గెలుచుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ సైతం సర్పంచ్ ఎన్నికలను చాలా ప్రెస్టిజెస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటా తిరిగి కేడర్‌ను బలోపేతం చేసుకునే దిశగా బీఆర్ఎస్ యోచిస్తోంది.