Site icon HashtagU Telugu

Ration card : సంక్రాంతి తర్వాత సన్నబియ్యం పంపిణీ : మంత్రి ఉత్తమ్..!

Minister Uttam

Minister Uttam

Minister Uttam Kumar Reddy : నేడు  సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని అన్నారు. ఈసారి వరి ధాన్యం 150 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యిందని తెలిపారు. ప్రోత్సాహకంగా సన్న వరిధాన్యం పండించిన రైతులకు రూ. 500 బోనస్ ఇస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యం, రూ. 18 వేల కోట్లతో రుణమాఫీ, అన్ని సౌకర్యాలతో ఆధునాతన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇలా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు రూపొందిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

కాగా, భారతదేశంలోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. సర్వే నెంబర్ 57లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను రూ. 200 కోట్లతో నిర్మించుకుంటున్నామని చెప్పారు. ఈ స్కూల్‌లో 4 నుంచి 12వ తరగతి వరకు క్లాసులు జరుగుతాయన్నారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామానికి వచ్చినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్నవారు కాంగ్రెస్ సభ్యులు కారు.. వీరంతా తమ కుటుంబసభ్యులని అన్నారు. ఈ సందర్బంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇంత మెజార్టీ ఇచ్చినందుకు ప్రజలకు మంత్రులు ధన్యవాదాలు తెలిపారు. ఇక, రేషన్ షాపుల్లో పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30.50 లక్షల రేషన్‌ కార్డు దారులకు ఉచితంగా ఆరు కిలోల సన్నబియ్యాన్ని అందించనున్నట్టు తెలిపారు. ఈ సన్న బియ్యాన్ని జనవరి 2025 నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ చేయనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Read Also: Viral Video: ఎన్టీఆర్ కొడుకులతో వెంకీమామ సందడి