Site icon HashtagU Telugu

Assembly : సంక్రాంతి తర్వాత సన్నబియ్యం: మంత్రి ఉత్తమ్‌

Sannabiyam after Sankranti: Minister Uttam Kumar Reddy

Sannabiyam after Sankranti: Minister Uttam Kumar Reddy

Assembly : రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో, త్వరలో సన్నబియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సంక్రాంతి తర్వాత రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని వెల్లడించారు. మరో రెండు మూడు నెలల్లో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. రేషన్‌ కార్డు ద్వారా వచ్చిన బియ్యం అక్రమంగా తరలించే వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్‌ హెచ్చరించారు. కొత్త రేషన్‌ డీలర్‌ షాపులు ఇచ్చే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వివరించారు.

ఇక మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి కొత్త రేషన్ షాపులు ఇవ్వడంపై మాట్లాడుతూ.. కొత్త రేషన్‌ డీలర్‌ షాపులు ఇవ్వడానికి మేం సిద్ధంగానే ఉన్నాం.. కానీ దాని వల్ల ప్రస్తుతం ఉన్న పాత డీలర్‌ షాపులపై ప్రభావం పడుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ హాయాంలో.. కొత్తగా 4 వేలకు తాండాలు కూడా గ్రామా పంచాయతీలు ఏర్పాటు అయ్యాయని వివరించారు. కొత్త రేషన్‌ డీలర్‌ షాపులు ఇచ్చే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వివరించారు. అన్ని చోట్ల కాకుండా.. అవసరం అనుకున్న చోట కొత్త రేషన్ షాపులు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి తెలిపారు. కేబినెట్ నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించారు.

కాగా, రాష్ట్రంలో దాదాపు 36 లక్షల మందికి నూతన రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 89.97 లక్షల తెల్లరేషన్‌కార్డులు, 2.81కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. కాంగ్రెస్‌ సర్కారు ప్రజాపాలన పేరుతో సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించింది. కొత్త రేషన్‌కార్డుల కోసం 10 లక్షల దరఖాస్తులు, కార్డుల్లో మార్పుల కోసం 11.33 లక్షల దరఖాస్తులు వచ్చాయి అన్నారు.

Read Also: Ravichandran Ashwin : స్వదేశానికి చేరుకున్న అశ్విన్‌