Sankranti Holidays: తెలంగాణ కాలేజీలకు సంక్రాంతి సెలవు తేదీలు

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ కాలేజీ విద్యార్థులకు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.సంక్రాంతి సెలవుల సందర్భంగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లో ఇంటర్మీడియట్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది

Published By: HashtagU Telugu Desk
Holidays

Holidays

Sankranti Holidays: సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ కాలేజీ విద్యార్థులకు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.సంక్రాంతి సెలవుల సందర్భంగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లో ఇంటర్మీడియట్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది తెలంగాణ విద్యాశాఖ. నిన్న శనివారం తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈ సెలవులు ప్రకటించింది.

జనవరి 13 నుండి 16 వరకు తెలంగాణలో కాలేజీలు మూసివేయబడతాయి. జనవరి 17 న తిరిగి అన్ని కాలేజీలు తెరవబడతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ మరియు అన్ ఎయిడెడ్, కో-ఆపరేటివ్, టిఎస్ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, బిసి వెల్ఫేర్, కెజిబివిలు మరియు ఇన్సెంటివ్ జూనియర్ కాలేజీలతో సహా వివిధ రకాల కాలేజీలకు ఈ సెలవులు వర్తిస్తాయి.

సంక్రాంతి సెలవుల్లో తరగతులు నిర్వహించరాదని, ఉల్లంఘనలకు పాల్పడితే తగు చర్యలు తీసుకుంటామని కళాశాల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.ఇదిలా ఉండగా హైదరాబాద్ మరియు ఇతర తెలంగాణ జిల్లాల్లోని పాఠశాలలు జనవరి 12 నుండి 17 వరకు ఆరు రోజుల సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అంతేకాకుండా పాఠశాలలు, కళాశాలలకు జనవరి 25న హజ్రత్ అలీ పుట్టినరోజు మరియు జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా సాధారణ సెలవుగా ప్రకటించింది.

రాష్ట్రప్రభుత్వం సెలవుల ప్రకటన వచ్చిన నేపథ్యంలో ఊర్లకు వెళ్లేందుకు విద్యార్థులు ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో బస్సులు, రైళ్లలో రద్దీ పెరగనుంది. మిషనరీ పాఠశాలలకు మినహాయించి మిగతా అన్ని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు వర్తిస్తాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.

Also Read: CM Revanth Reddy : 30 రోజుల పాలన ఎలా ఉంది..?

  Last Updated: 07 Jan 2024, 12:01 PM IST