Site icon HashtagU Telugu

Sankranti 2024 : సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్

Sankranti Holidays

Sankranti Holidays

తెలంగాణ (Telangana)లో స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం (TS Govt) సంక్రాంతి సెలవులు (Sankranti Holidays) ప్రకటించింది. జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగను ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి అంటే పెద్ద పండగ. రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్లు, కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతుంది. అంతేకాదు ఈ సమయంలో రైతులకు పంట కూడా చేతికందుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇలా ఒకటి రెండు కాదు.. అనేక విశేషాలున్న సంబురాల సంక్రాంతి పండుగతో పల్లెటూళ్లన్నీ కళకళలాడుతాయి. అంతేకాదండోయ్ హరిదాసు కీర్తనలు, గాలి పటాలు, బసవన్న చిందులు, భోగి పంటలతో సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. సంక్రాంతి వస్తుందంటే చాలు.. దేశ నలుమూలాలనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్న సరే వారంతా తమ సొంతళ్లుకు వచ్చి పండగను కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. అందుకే సంక్రాంతి కి ప్రభుత్వం స్కూల్స్ కు సెలవులు ప్రకటిస్తుంటుంది.

తాజాగా తెలంగాణ సర్కార్..ప్రభుత్వం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. జనవరి 13న 2వ శనివారం కాగా.. 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలు ఉన్నాయి. మొత్తంగా సంక్రాంతికి ఐదు రోజులు కలిసి రాబోతున్నాయి. మరోపక్క సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే 32 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.

Read Also : Virtual Gang Rape : బాలికపై వర్చువల్ గ్యాంగ్ రేప్.. మెటావర్స్‌ గేమ్‌ ఆడుతుండగా అఘాయిత్యం