Sankranti Celebrations: ఆస్ట్రేలియాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు (Sankranti Celebrations) నిర్వహించారు. మెల్‌బోర్న్‌లోని తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. దేశాలు దాటి ఆస్ట్రేలియాకు వచ్చినా కూడా మన తెలుగు సాంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ అందరూ కలిసి సంబరాలు నిర్వహించుకోవడం చాలా అభినందనీయమన్నారు. తెలుగు ప్రజలు ఇక్కడ లక్ష మంది ఉండి ఎంతో కష్టపడి అభివృద్ధికి సహకారాన్ని అందిస్తూ మన సంప్రదాయాలను కాపాడుతూ ఇలా సంబరాలు చేసుకోవడం గొప్ప విషయమని ప్రశంసలు కురిపించారు. మన పల్లెల్లో చేసుకున్న విధంగానే ఇక్కడ పండుగ చేసుకుంటూ ఆనందంగా ఉండాలని పేర్కొన్నారు.
Also Read: Flamingo Festival Celebrations: అట్టహాసంగా ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు పారిశ్రామికవేత్తలు మీ ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టి అక్కడ అభివృద్ధికి సహకారాన్ని అందించాలి. మీ అందరిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందం నింపాలి. సంస్కృతి సంప్రదాయాలు పరిమళించే అతి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి ప్రకృతితో అనుసంధామైన రైతుల పండుగ. ఆరుగాలం శ్రమించి చేతికొచ్చిన పంటను చూసి రైతు మురిసిపోయే పండుగ. ఈ సంక్రాంతితో రైతుల కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆయన పేర్కొన్నారు.
ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో జవనరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకున్న విషయం తెలిసిందే. మొదటి రోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి.. మూడో రోజు కనుమను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆనందంగా జరుపుకున్నారు.