TS : కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలు వేణు గోపాల చారి, రాజేశ్వర్ రావు

బీఆర్ఎస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు లు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు

Published By: HashtagU Telugu Desk
Samudrala And Mlc Rajeshwar

Samudrala And Mlc Rajeshwar

చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy )..బిఆర్ఎస్ (BRS) ను ఖాళీ చేసేలా కనిపిస్తున్నాడు. కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేసాం..అని అంటే ఏదో ఒకరిద్దరు చేరుతారని అంత భావించారు..కానీ బిఆర్ఎస్ లో ఒకరిద్దరే ఆఖరికి మిగిలేలా చేస్తాడని ఇప్పుడు అంత మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వరుసపెట్టి ప్రతి రోజు బిఆర్ఎస్ పార్టీ లో కీలక వ్యక్తులుగా పేరు తెచ్చుకున్న వారి దగ్గరి నుండి చిన్న చితక నేతలంతా కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు. పదేళ్ల పాటు కీలక పదవులు అనుభవించిన వారే కాదు కేసీఆర్ కు నమ్మకస్తులుగా ఉన్నవారు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకోవడం బిఆర్ఎస్ శ్రేణులను జీర్ణించుకోలేకుండా చేస్తుంది. ఇప్పటికే ఎంతోమంది కాంగ్రెస్ లో చేరగా..ఈరోజు కూడా కీలక వ్యక్తులు పార్టీ కండువా కప్పుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

బీఆర్ఎస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి (Samudrala Venugopal Chari), మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు (MLC Rajeshwar Rao) లు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్బంగా వారికీ కాంగ్రెస్ కండువా కప్పి వారిని పార్టీలోకి రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నిజమాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జా తదితరులు పాల్గొన్నారు. నిన్న బోథ్, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, చిలుముల మధన్‌రెడ్డిలు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఇలా ప్రతి రోజు కారు దిగి వస్తుంటే..లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బిఆర్ఎస్ ఖాళీ అవుతుందేమో అని అంత సందేహ పడుతున్నారు.

Read Also : UPSC Civil Services Exam Result 2023: సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించిన తెలంగాణ బిడ్డ

  Last Updated: 16 Apr 2024, 03:37 PM IST