Sama Ram Mohan Reddy : అగ్గి పెట్టె హరీష్ అంటూ సామా రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మీరు బీజేపీ కాళ్లు పట్టుకోవడమే తక్కువ. నేను చెప్పేది అబద్దమైతే రోడ్డెక్కి బీజేపీ పైన మన తెలంగాణ హక్కుల గురించి కొట్లాడు

Published By: HashtagU Telugu Desk
Saamu Harish

Saamu Harish

తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో బీఆర్ఎస్ ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితం కాగా.. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కనీసం ఒక్కసీటు కూడా గెలవకపోవటం గమనార్హం. దీంతో కాంగ్రెస్ , బిజెపి పార్టీలు మరింతగా బిఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి..మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఫై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మొన్నటికి మొన్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కొత్త సర్కస్ మొదలు పెట్టాడని , అల్లుడు హరీశ్ రావును బీజేపీలోకి పంపనున్నారంటూ.. సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలువగా..తాజాగా మరోసారి హరీష్ ఫై ఘాటైన వ్యాఖ్యలే చేసారు. సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా.. ”తెలంగాణ అబద్దాల బ్రాండ్ అంబాసిడర్ అగ్గి పెట్టె హరీష్ రావు గారు.. ఏపీ ముఖ్యమంత్రి బాబు గారి పింఛన్ల నిర్ణయంపైన మీ ప్రశంస.. ఆయన వెనకాల ఉన్న బీజేపీ పైన భక్తితో అని అందరికీ తెలుసు. బీజేపీ పాలిత ఒడిశా ప్రభుత్వం ధాన్యంపై క్వింటాకు రూ.1000 బోనస్ ఇస్తుంది అని మీరు చెప్పిన అబద్ధం బీజేపీ కోసం మీరు చేసే దిగజారుడు రాజకీయాన్ని బట్టబయలు చేస్తుంది.

మీరు బీజేపీ కాళ్లు పట్టుకోవడమే తక్కువ. నేను చెప్పేది అబద్దమైతే రోడ్డెక్కి బీజేపీ పైన మన తెలంగాణ హక్కుల గురించి కొట్లాడు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి.. గత పదేళ్ళలో మీరు చేసిన అవినీతి నుండి కాపడుకోవడం కోసం బీజేపీతో కలిసే మీ ఎత్తుగడలో భాగంగా ఇతర రాష్ట్రాల ముందు తెలంగాణాని చిన్నగ చేస్తే ప్రజలు సహించరు. మీరు తెలంగాణకు చేసిన దగా ప్రజలు మరువలేనిది క్షమించారానిది. మీ స్వార్థ రాజకీయాలకు ప్రజలు బలిపశువులు కావడానికి సిద్ధంగా లేరు. మీ ఊసరవెల్లి రాజకీయాలకు ప్రజలు ఇచ్చిన తీర్పే లోక్ సభలో సున్నా” అని రామ్మోహన్ పోస్ట్ చేసారు.

Read Also : Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ ప్రమోషనల్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. పంజాబీ స్టైల్‌తో..

  Last Updated: 15 Jun 2024, 04:33 PM IST