Sama Ram Mohan Reddy : కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్‌గా సామ రామ్మోహన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ మీడియా, కమ్యూనికేషన్స్ కమిటీ చైర్మన్‌గా సామ రామ్మోహన్ రెడ్డిని నియమిస్తూ ..వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు

Published By: HashtagU Telugu Desk
Samu

Samu

కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోకి రావడానికి కృష్టి చెందిన వారికీ సీఎం రేవంత్ (CM Revanth Reddy) ప్రముఖ స్థానం కలిపిస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ రాని నేతలకు పలు శాఖల్లో కీలక పదవులు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి..తాజాగా సామ రామ్మోహన్ రెడ్డి (Sama Ram Mohan Reddy)కి కీలక పదవి కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీ మీడియా, కమ్యూనికేషన్స్ కమిటీ చైర్మన్‌ (TPCC Media Chairman)గా సామ రామ్మోహన్ రెడ్డిని నియమిస్తూ ..వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకుల కార్యక్రమాలు, ఏఐసీసీ, టీపీసీసీ నిర్ణయాలను ఎప్పటికప్పుడు మీడియాకు చేరవేసేందుకు రామ్మోహన్ కో-ఆర్డినేట్ చేయనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు. పార్టీ అధికార ప్రతినిధిగా తాను గత పదేళ్లుగా ఎన్నో డిబేట్లు, ఇంటర్వ్యూలలో బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలను జనాల్లోకి సమర్ధవంతంగా చేరవేశానని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఆవశ్యకతను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించానని తెలిపారు. ఇప్పుడు కూడా తనకు ఇచ్చిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Read Also ; Actor Suman : రాజకీయ నాయకుల్ని అవినీతి పరుల్ని చేసింది ప్రజలే – నటుడు సుమన్

  Last Updated: 01 Apr 2024, 08:27 PM IST