ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Scam Case)లో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ (Kavitha Bail) మంజూరు కావడంతో తెలంగాణ లోని రాజకీయ పార్టీల్లో వేడి మొదలైంది. బిజెపి – బిఆర్ఎస్ కలిసి పోయారని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే..కాంగ్రెస్ , బిఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతుందని బిజెపి ఆరోపిస్తుంది. ఇలా మూడు పార్టీల మధ్య మాటల వార్ నడుస్తుంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని అందుకే కవితకు బెయిల్ వచ్చిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి సామరామ్మోహన్ సైతం ఈ అంశంపై స్పందించారు. తెర వెనుక బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని, ఎన్నికలప్పుడే డ్రామాలు ఆడతారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి (Sama Ram Mohan Reddy ) అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలో భాగంగా కవిత అరెస్ట్ జరిగిందే తప్ప.. బీజేపీ, బీఆర్ఎస్ చేసిన అక్రమాలపై చర్యలు తీసుకోలేదు, తీసుకోబోదని పేర్కొన్నారు. గత పదేళ్లుగా రాష్ట్ర వనరులను కొల్లగొట్టిన బీఆర్ఎస్ నాయకుల మీద బీజేపీ ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదని, కానీ ఎన్నికలప్పుడు ప్రధాని తెలంగాణకు వచ్చి బీఆర్ఎస్ చేసిన అక్రమాలు తన టేబుల్ మీద ఉన్నాయని.. ఇదో పెద్ద అవినీతి కుటుంబమని, దేశ రాజకీయాలకే డబ్బు పంపించేంత అవినీతి చేసిందని చెప్పినట్లు గుర్తు చేశారు. మోడీ అన్ని చెప్పి బీఆర్ఎస్ పై చర్యలు తీసుకోలేదని, ఎందుకంటే తెర వెనుక బీజేపీ, బీఆర్ఎస్‌లు ఒక్కటేనని, ఈ రెండింటికీ కామన్ శత్రువు కాంగ్రెస్ పార్టీ అని, ఎన్నికలప్పుడే ఈ డ్రామాలు ఆడతారని విమర్శించారు. కవిత బెయిల్ మీద బయటకి వస్తుందని, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాబోతున్నాయని మొన్ననే రేవంత్ రెడ్డి కూడా చెప్పారని గుర్తు చేశారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ది ఉంటే గత పాలనలో అవినీతి చేసిన బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలన్నారు.
Read Also : Hydra : జన్వాడ ఫాంహౌస్ ను కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు సిద్దమయ్యారా..?