సజ్జనార్ మరో నిర్ణయం.. చిల్లర కష్టాలకు చెక్!

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ అనూహ్యమైన నిర్ణయాలు, ఆలోచనలను అమలు చేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన పలు బస్ డిపోలను క్షుణంగా పరిశీలించారు.

  • Written By:
  • Publish Date - October 26, 2021 / 05:44 PM IST

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ అనూహ్యమైన నిర్ణయాలు, ఆలోచనలను అమలు చేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన పలు బస్ డిపోలను క్షుణంగా పరిశీలించారు. మూత్రశాలలు, టాయిలెట్స్ శుభ్రంగా ఉంచాలని, ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రతిరోజు శుభ్రం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత బస్సులపై అసభ్యకరమైన పోస్టర్లు అతికించకుండా హెచ్చరికలు జారీ చేశారు.

కనీసం 30 మంది ప్రయాణికులు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే నేరుగా బస్సునే కాలనీకి పంపించేలా చర్యలు తీసుకున్నారు.  ‘ప్రయాణికులను ఎక్కించుకునేందుకు రోడ్ల మధ్యలో ఆర్టీసీ బస్సులు ఆపటం ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధం, ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధిస్తే ఆ మొత్తాన్ని సంబంధిత డ్రైవర్ల నుంచి వసూలు చేయటమే కాదు, క్రమశిక్షణ చర్యలు సైతం తీసుకోవాల్సి వస్తుంది’ అని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఆర్టీసీ బస్సుల్లో అటు ప్రయాణికులు, ఇటు కండక్టర్లకు చిల్లర లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 5 రూపాయలు, 2 రూపాయలు, 1 రూపాయి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సజ్జనార్ సరికొత్త ఉపాయం తీసుకొచ్చారు. యూపీఐ పద్దతిలో ఆన్ లైన్ పేమెంట్స్ చేయొచ్చని తెలిపారు. ఈ నిర్ణయంతో చాలామంది ప్రయాణికులకు చిల్లర కష్టాలు తప్పనున్నాయి.