Hyderabad Crime: పార్సిళ్ల పేరుతో లక్షలు దోచేసిన కేటుగాళ్లు.. జనాలకు సజ్జనార్ అలర్ట్

  • Written By:
  • Updated On - March 25, 2024 / 11:38 AM IST

Hyderabad Crime: రోజురోజుకూ క్రైమ్స్ పెరిగిపోతున్నాయే… తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. బ్యాంకుల పేరుతో, డెలివరి పేరుతో, తాజాగా పార్సిళ్ల పేరుతో నయా దోపిడీకి పాల్పడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన కేటుగాళ్లు విద్యావంతులను బురిడీ కొట్టిస్తున్నారు. ఫేక్ కాల్స్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో సామాన్యుల నుంచి విద్యావంతుల వరకు కేటుగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా ఇటీవల పీహెచ్‌డీ స్కాలర్‌కి ఫోన్‌ కాల్‌ చేసి అక్షరాల రూ.31 లక్షలను కొల్లగొట్టారు. తను ఉగ్రవాదులతో కలిసి జాయింట్‌ అకౌంట్‌ తీశారని, అందులో అనుమానస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని చెప్పారు. తన లాప్‌ టాప్‌ను, ఫోన్‌ను ఉగ్రవాదులు హ్యాక్‌ చేశారని భయపెట్టారు.

ఈ కేసులతో తనకేం సంబంధం లేదని చెప్పిన వినకుండా భయభ్రాంతులకు గురిచేశారు. భయపడిపోయిన వ్యక్తి రూ.31 లక్షలను తమ బ్యాంక్‌ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. లావాదేవీలు సక్రమంగా ఉంటే ఆ నగదును తిరిగి ఇచ్చేస్తామని నమ్మించారు. తర్వాత వారు స్పందించలేదు. చివరికి మోసపోయానని గుర్తించిన ఆ ఐఐటీ పీహెచ్‌డీ స్కాలర్‌.. సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

ఇలాంటి నేరాలపై అప్రమత్తంగా ఉండాల్సిన ఉన్నత విద్యావంతలే. మోసాలకు గురవుతున్నారని సజ్జనార్ తెలిపారు. అజ్ఞాత వ్యక్తుల నుంచి డ్రగ్స్ పార్శిళ్ల పేరుతో ఫోన్ కాల్స్ కానీ, ఐవీఆర్ కాల్స్ వస్తే వాటికి అసలే స్పందించవద్దు అని సూచించారు. ముఖ్యంగా అలాంటి వారికి ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు అని జాగ్రత్తలు చెప్పారు. డ్రగ్స్ కేసు అని, ఉగ్రవాదులతో సంబంధాలని బెదిరించగానే భయపడి డబ్బులు బదిలీ చేయొద్దు అన్నారు. మీరు ఒకవేళ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నంబర్ 1930 ఫోన్ చేయాలని. లేదా స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచించారు