Saddula Bathukamma: అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

తెలంగాణాలో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలన్నీ పూల తోటలుగా మారిపోయాయి. రంగురంగుల పూలతో చేసిన బతుకమ్మలు విశేషంగా ఆకట్టుకున్నాయి

Saddula Bathukamma: తెలంగాణాలో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలన్నీ పూల తోటలుగా మారిపోయాయి. రంగురంగుల పూలతో చేసిన బతుకమ్మలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో చిన్నారులు, మహిళలు, యువతులు ఆడుతూకనువిందు చేశారు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’ పాటలు ఆలపించారు. రంగురంగుల పూలను త్రిభుజాకారంలో పేర్చి బతుకమ్మలు చుట్టి చేతులు దులుపుకుని నృత్యాలు చేశారు. ప్రధానంగా నగరంలోని చెరువుల వద్ద ప్రత్యేక సందడి కనిపించింది.

తెలంగాణ ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించడంతో పరిసర ప్రాంతాలు బతుకమ్మ ఆడేందుకు కేంద్రంగా మారాయి. మరోవైపు నగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ వివిధ రకాల బతుకమ్మలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మరోవైపు దసరా పండుగ కావడంతో ఆలయాలన్నీ శోభాయమానంగా ముస్తాబయ్యాయి.

తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు చేసి భక్తులు ఆశీస్సులు తీసుకుంటున్నారు. సాయంత్రం జమ్మి సంబరాలు నిర్వహించి రావణ దహనం పూర్తి చేస్తారు. ఈ క్రమంలో జమ్మి ఆకులను ఒకరికొకరు పంచుకుని ఆలింగనం చేసుకుంటారు. కాలనీల్లో అందరూ ఒకే చోట చేరి సంగీత కార్యక్రమాలు, నృత్యాలతో అలరించనున్నారు.

Also Read: Festival Time – Gut Health : ఫెస్టివల్ టైంలో హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్‌