Sabitha Indra Reddy : పార్టీ మారడం ఫై మాజీ మంత్రి సబితా క్లారిటీ

ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరబోతున్నారని.. అతనికి నామినేటెడ్ పోస్టు కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో

  • Written By:
  • Publish Date - July 1, 2024 / 10:57 AM IST

బిఆర్ఎస్ పార్టీ (BRS Party) లో ఎవరు..ఎప్పుడు పార్టీ మారతారనేది టెన్షన్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందు నుండి పెద్ద ఎత్తున నేతలు బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి , బిజెపి , కాంగ్రెస్ పార్టీలలో చేరుతున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు సైతం తాజాగా కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఇదే బాటలో మరికొంతమంది నేతలు ఉన్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఈ తరుణంలో మాజీ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి (Sabitha Indra Reddy) సైతం పార్టీ మారబోతున్నారనే వార్తలు వైరల్ గా మారాయి. దీంతో ఆ వార్తలఫై ఆమె స్పందించింది.

ట్విట్టర్ వేదికగా ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. అవన్నీ అవాస్తవాలేనని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ తనకు సముచిత స్థానం కల్పించారని వివరించారు. పార్టీ మారాల్సిన అవసరం కానీ, మారే ఆలోచన కానీ తనకు ఎంతమాత్రమూ లేవన్నారు. బీఆర్ఎస్ లోనే కొనసాగుతూ కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని మాజీ మంత్రి సబిత స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేయొద్దని ప్రసార మాధ్యమాలకు విజ్ఞప్తి చేస్తున్నా.. అంటూ ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని.. కాంగ్రెస్‌ ప్రభుత్వం సబితాఇంద్రారెడ్డి హోం మంత్రిగా పనిచేశారు. ఇక తెలంగాణ సిద్ధించాక కూడా 2019లో కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌‌లో చేరగా.. ఆమెకు కేసీఆర్ మంత్రి పదవి అప్పగించారు. అయితే.. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో.. మళ్లీ ఆమె తన సొంత గూటికి వెళ్లనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరబోతున్నారని.. అతనికి నామినేటెడ్ పోస్టు కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె క్లారిటీ ఇచ్చింది. సబితా క్లారిటీ తో బిఆర్ఎస్ శ్రేణులు హమ్మయ్య అనుకుంటున్నారు.

Read Also : Chandrababu : 39 ఏళ్ల తర్వాత మంగళగిరిలో టీడీపీ గెలిచింది – చంద్రబాబు