MLC Kavitha : ఎమ్మెల్సీ కవితను పరామర్శించిన మాజీ మంత్రులు సబిత, సత్యవతి

మంగళవారం ఉదయం ఢిల్లీలోని తీహార్‌ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు.. కవితతో ములాఖాత్‌ అయ్యారు

  • Written By:
  • Publish Date - June 18, 2024 / 11:40 AM IST

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌ కేసు (Delhi liquor policy case)లో అరెస్ట్‌ అయి తిహార్‌ జైల్లో ఉన్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ క‌లిశారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని తీహార్‌ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు.. కవితతో ములాఖాత్‌ అయ్యారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, బాల్క సుమన్‌ కూడా కవితను కలిసిన విషయం తెలిసిందే. అలాగే రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా క‌విత‌తో ములాఖాత్ అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్ట్‌ అయి మూడు నెలలు కావస్తోంది. తీహార్ జైలులోని 6 కాంప్లెక్స్‌లో కవిత 80 రోజులుగా ఉంటున్నారు. బెయిల్ కోసం ఆమె ట్రై చేస్తున్నప్పటికీ ..కోర్ట్ ఆమెకు బెయిల్ ఇవ్వడం లేదు. దీంతో ఆమె బయటకు వస్తుందో రాదో అని పార్టీ శ్రేణులు ఖంగారు పడుతున్నారు. కవితతో కేసీఆర్, కుటుంబ సభ్యులు ఫోన్ లో మాట్లాడుతున్నారు. కవిత యోగ యోగక్షేమాలపై ఆరా తీస్తున్నారు. తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ అధికారులు ఏప్రిల్ 11న అరెస్టు చేశారు. మూడు రోజుల సిబిఐ కస్టడీ తర్వాత, సిబిఐ కేసులో కవితను జ్యుడిషియల్ కస్టడీకి కూడా రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. కోర్టు అనుమతితో జైలులో ఎన్నో పుస్తకాలు చదువుతూ ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతోంది. మద్యం కేసులో ఈడీ, సీబీఐ అరెస్టులను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌లను రూస్ అవెన్యూ కోర్టు ఇప్పటికే తిరస్కరించింది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాలు చేశారు. కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది.

Read Also : Electricity Purchase Scam : తెలంగాణ డిస్కంలకు వేల కోట్ల నష్టం.. కారణం అదేనా ?