Site icon HashtagU Telugu

BJP : రేపు ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద రైతు హామీల సాధన దీక్ష

Rythu Deeksha

Rythu Deeksha

కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Govt) రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి ..రేపు ఇందిరాపార్కు ధర్నాచౌక్ (Dharnachowk to Indira Park) వద్ద ‘రైతు హామీల సాధన దీక్ష’ (Rythu Hamila Sadhana Deeksha) చేయబోతుంది బిజెపి. రేపు ఉదయం 11 గంటల నుంచి 24 గంటలపాటు ఈ దీక్ష చేయనున్నట్టు బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి (BJLP leader Maheshwar Reddy) పేర్కొన్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ దీక్ష లో పాల్గొంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి అసెంబ్లీలో చర్చ కూడా పెట్టలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మెడలు వంచి అన్నదాతలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.

రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబరు 30 ఉదయం నుంచి అక్టోబరు 01 ఉదయం వరకు హైదరాబాదులోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద రైతు హామీల సాధన దీక్ష చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నర నెలలవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని బీజేపీ మండిపడుతోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేస్తోంది. కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ నేతలు అంటున్నారు. మరి ఈ దీక్ష కు పోలీసులు అనుమతి ఇస్తారో లేదో చూడాలి. ఇప్పటికే నగరంలో హైడ్రా ఆందోళనలు నడుస్తున్నాయి. గత మూడు రోజులుగా బాధితులు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలియజేస్తుండగా..ఈరోజు ఆదివారం బిఆర్ఎస్ సైతం బాధితుల నిరసనల్లో పాల్గొంది. ఈ క్రమంలో రేపు రైతు దీక్ష అని బిజెపి పిలుపు నివ్వడం తో ఏంజరుగుతుందో అని నగరవాసులు టెన్షన్ పడుతున్నారు.

Read Also : Whatsapp Tips : ఈ 4 నంబర్లను మీ వాట్సాప్ లో తప్పకుండా సేవ్ చేసుకోండి.. ఎందుకో తెలుసా?