రైతు బంధు (రైతు భరోసా ) (Rythu Bandhu) విషయంలో తెలంగాణ సర్కార్ (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ..రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం కోసం ప్రతి ఎకరాకు రూ. 15 వేలు అందజేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఖరీప్ సీజన్ నుంచి పంట పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ప్రతి రైతుకు ఎకరాకు రూ. 10 వేల ఆర్థిక సాయం చేసేవారు. ఇదే పథకాన్ని రైతు భరోసాగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ. 15 వేలు రెండు విడతల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా గత ప్రభుత్వంలో రైతులకు ఎన్ని ఎకరాలు ఉంటె అన్ని ఎకరాలకు రైతు బంధు వేసేవారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం ఐదు ఎకరాల వరకే రైతు బంధు ను ఇవ్వాలని డిసైడ్ చేసింది. అంతే కాదు కేవలం రైతులకు మాత్రమే రైతు భరోసా దక్కాలనేది ప్రభుత్వ ఉద్దేశమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గుట్టలు, కొండలు, రియల్ ఎస్టేట్ లే అవుట్ల వంటి వాటికి మినహాయింపు ఇవ్వబోతుంది. ఇంకా ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఒక రైతుకు ఐదు ఎకరాలకు వరకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నారని సమాచారం.
అలాగే ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీని అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తూ వస్తున్నారు. దీనిపై కూడా ఆర్థిక శాఖ అధికారులు, మంత్రివర్గ సహచరులతో కలిసి విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికీ, సంస్థలకు ఉన్న భూములకు, ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ ఎకౌంటెంట్లు ఇలా పలు రంగాలకు చెందిన వారి భూములకు రుణమాఫీ అమలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇలా వీరందరినీ తొలగించగా, ఇప్పుడు సుమారు 26 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందట. జులై మొదటి వారం నుంచే దశల వారీగా రుణమాఫీ అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మాఫీలో భాగంగా మొదటగా రూ.లక్ష వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేయనున్నారు. తర్వాత రూ.లక్షన్నర..చేయనున్నారట. రూ.2 లక్షల వరకు ఉన్న వారికి తర్వాత రెండు దశల్లో అమలు చేయనున్నట్లు సమాచారం. ఇక రేపు (జూన్ 21) జరిగే మంత్రివర్గ భేటీలో రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా పథకంపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం.
Read Also : ITR: ఐటీఆర్ గడువులోగా ఫైల్ చేయకుంటే ఈ సమస్యలు తప్పవు..!