తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా (Rythu Bharosa) పథకానికి సంబంధించి, ఇంకా నిధులు పొందని రైతులకు శుభవార్త. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. జూన్ 20 లోపు దరఖాస్తు చేయడం వల్ల రైతులు కూడా ఈ పథకం ద్వారా మేలు పొందే అవకాశం కలుగుతుంది. రైతులు అవసరమైన ఫామ్‌ను తమ ప్రాంతంలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) వద్ద పొందవచ్చు లేదా rythubharosa.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
WTC Format: ఇకపై ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి డబ్ల్యూటీసీ ఫైనల్!
దరఖాస్తు ఫామ్‌కు కొన్ని కీలకమైన పత్రాలు అటాచ్ చేయాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యంగా పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు, బ్యాంక్ సేవింగ్స్ ఖాతా వివరాలు (జిరాక్స్ కాపీ) ఉన్నాయి. ఈ వివరాలను సరైన రీతిలో పూరించి ఏఈవోకు సమర్పించాలి. ఏఈవో ఆ వివరాలను పరిశీలించి, అర్హులైన దరఖాస్తులను జిల్లా స్థాయి అధికారులకు పంపుతారు.
Aadhaar Card: ఇంటి నుంచే నిమిషాల్లో ఆధార్ కార్డ్‌ను అప్‌డేట్ చేసుకోండిలా!
జిల్లా స్థాయి అధికారుల పరిశీలన అనంతరం అర్హత నిర్ధారణ అయితే, రైతు భరోసా నిధులు నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయబడతాయి. రైతులు చివరి తేదీ అయిన జూన్ 20 లోపు తప్పనిసరిగా దరఖాస్తు పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది రైతులకు తగిన సమయంలో ఆర్థిక ఊరట కలిగించే పథకంగా నిలుస్తుంది. అందుకే, సరైన సమాచారం, పత్రాలతో వెంటనే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించమని అధికారులు సూచిస్తున్నారు.