Site icon HashtagU Telugu

Rythu bandhu: ఈ నెల 28 నుంచి రైతుల అకౌంట్లోకి రైతుబంధు నిధులు..!!

Kcr

Kcr

తెలంగాణ సర్కార్ ఇస్తున్న రైతు బంధు నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈనెల 28 నుంచి వానాకాలం పంట పెట్టుబడికి రైతు బంధు నిధులను రిలీజ్ చేయాలని బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రైతుల అకౌంట్లోకి రైతు బంధు నిధులను జమ చేస్తామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. గతంలో మాదిరిగానే వరస క్రమంలో రైతుల అకౌంట్లో రైతు బంధు నిధులను సర్కార్ జమ చేసే అవకాశం ఉంది.