Site icon HashtagU Telugu

Rythu Bandhu : మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్.. రైతు బంధు నిధులు విడుదల

Raithubharosa

Raithubharosa

మే 09 లో రైతు బంధు (Rythu Bandhu) డబ్బును రైతుల ఖాతాల్లో వేస్తామని చెపుతూ వచ్చిన సీఎం రేవంత్ (CM Revanth Reddy)..చెప్పినట్లు ఈరోజు సోమవారం 5 ఎకరాలు పైబడిన రైతుల ఖాతాల్లో రైతు బంధును జమ చేసారు. రైతు బంధు (భరోసా) కింద రూ.2వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీటితో పాటు పంట నష్ట పరిహారం కింద ఎకరానికి రూ.10వేల నిధులను కూడా ఈసీ అనుమతితో ప్రభుత్వం విడుదల చేయడం విశేషం. ఇప్పటి వరకు ఐదు ఎకరాలలోపు రైతులకు రైతు భరోసాను జమ చేయగా.. సోమవారం నుంచి ఐదు ఎకరాలు పైబడిన రైతులకు నిధులు ఖాతాల్లో జమ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

రైతు భరోసా నిధులపై గత కొద్దీ రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల ప్రచారం లోను ఇదే నడుస్తుంది. రేవంత్ రైతు బందును లేపేసి ప్రయత్నం చేస్తున్నారని..అందుకే రైతు భరోసా నిధులు వెయ్యకుండా కాలం గడిపేస్తున్నారని..బిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తూ రైతుల్లో భయం నింపుతూ వస్తుంది. ఇప్పటివరకు ప్రభుత్వం జమ చేయకపోయేసరికి ఇది నిజమే కావొచ్చని అనుకుంటూ వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మే 9వ తేదీలోపు రైతు భరోసా నిధులు విడుదల చేయకపోతే ముక్కు నేలకు రాస్తానంటూ ఛాలెంజ్ సైతం విసిరారు. నిధులు విడుదలైతే కేసీఆర్ ముక్కు నేలకు రాయాలంటూ సవాల్ విసిరారు. మరి ఇప్పుడు రైతుబంధు విడుదల చేసారు కాబట్టి రేవంత్ సవాల్ ను కేసీఆర్ ఏమైనా స్వీకరిస్తారా..? అనేది చూడాలి.

ఇదిలా ఉంటె తెలంగాణలో అకాల వర్షాలు, కరవు పరిస్థితులతో పంట నష్టపోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకు పంట నష్టం నిధులును ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేసింది. పంట నష్టం నిధులు విడుదలకు ఈసీ అనుమతించడంతో ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. 15,246 మంది రైతులకు రూ. 15.81 కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 10 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది.

Read Also : Viral : సత్యజిల్లాలో రోడ్డుపై కొట్టుకున్న కానిస్టేబుళ్లు..

Exit mobile version