BJP RTI WAR: కేసీఆర్ స‌ర్కార్ పై బీజేపీ `ఆర్టీఐ` వార్

తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా ఆర్డీఐ ద్వారా సేక‌రించిన స‌మాధానాల‌తో యుద్ధం చేయాల‌ని బీజేపీ సిద్ధం అయింది.

  • Written By:
  • Updated On - August 2, 2022 / 04:44 PM IST

తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా ఆర్డీఐ ద్వారా సేక‌రించిన స‌మాధానాల‌తో యుద్ధం చేయాల‌ని బీజేపీ సిద్ధం అయింది. ఆ మేర‌కు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఇటీవ‌ల ఆర్టీఐకి వేసిన ప్ర‌శ్న‌ల‌కు వ‌చ్చిన స‌మాధాల‌ను వెల్ల‌డించారు. రాష్ట్ర ప్రభుత్వం 2014-15 నుంచి కల్లుగీత కార్మికుల సంక్షేమానికి మంజూరు చేసిన నిధుల్లో నాలుగో వంతు మాత్రమే పంపిణీ చేసిందని సంజయ్ ఆర్టీఐ ప్రశ్నకు వ‌చ్చిన స‌మాధానాన్ని వెల్లడించారు.

జూలై మొదటి వారంలో వివిధ ప్రభుత్వ శాఖలు , రాష్ట్ర ప్రాయోజిత లేదా తెలంగాణ టోడీ టాపర్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (TTTCFC) వంటి యాజమాన్య సంస్థలకు దాదాపు 100 RTI ప్రశ్నలను దాఖలు చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. RTI ప్రత్యుత్తరాలతో పకడ్బందీగా టిఆర్ఎస్ నేతృత్వంలోని ప్రభుత్వంపై యుద్ధం చేయాల‌ని బీజేపీ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగా జిల్లా, మండల స్థాయిలలో ఇలాంటి RTI ప్రశ్నలను దాఖలు చేయాలని పార్టీ నాయకులందరినీ కోరారు. ఖర్చు చేసిన సొమ్ముకు సంబంధించి 2014-15 నుంచి 2021-22 మధ్య ప్రభుత్వం రూ.76.30 కోట్లు మంజూరు చేసిందని, అయితే వాస్తవంగా రూ.24.83 కోట్లు మాత్రమే విడుదలైందని టీటీటీసీఎఫ్‌సీ తెలిపింది. ఆ సొమ్ములో కార్పొరేషన్ రూ.18.79 కోట్లు ఖర్చు చేసిందని ఆర్టీఐ సమాధానంలో పేర్కొంది. 2018-19లో మంజూరైన రూ.65 కోట్లలో చివరిసారిగా రూ.21.54 కోట్లు వచ్చాయి. కార్పొరేషన్ దాదాపు రూ.15.50 కోట్లు వినియోగించింది. గత ఎనిమిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 2015-16, 2017-18, 2018-19లో మూడుసార్లు మాత్రమే నిధులు విడుదల చేసింది. ప్ర‌స్తుతం ఆర్టీఐ యుద్ధం ప్రాథ‌మిక ద‌శ‌లో ఉంద‌ని, రాబోవు రోజుల్లో ఇలాంటి వార్ మ‌రింత వేగంగా ఉంటుందని బండి వెల్ల‌డించారు.

Also Read:  AP & TS Likely Sri Lanka: ఏపీ, తెలంగాణాల్లో శ్రీలంక `బూచి`