Site icon HashtagU Telugu

Free Bus : మహిళలతో కిక్కిరిసిపోతున్న ఆర్టీసీ బస్సులు

Free Bus Ts

Free Bus Ts

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకానికి మహిళలు బ్రహ్మ రధం పడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తిరుగులేని విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే ఇచ్చిన ఆరు హామీల్లో (Congress 6 Guarantees) రెండు హామీలను నెరవేర్చింది. చేయూత పథకంతో పాటు మహాలక్ష్మి పథకానికి శనివారం కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. చేయూత పధకం కింద ఆరోగ్య శ్రీని 10 లక్షలకు పెంచగా..మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించారు.

We’re now on WhatsApp. Click to Join.

మహాలక్ష్మీ పథకం అమలు చేయడం ఫై యావత్ రాష్ట్ర మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాన్ని ఇలాగే ఐదేళ్ల పాటు కొనసాగించాలని..మిగతా నాల్గు పథకాలు కూడా 100 రోజుల్లోపే నిరవేర్చాలని వారంతా కోరుకుంటున్నారు. బస్ టికెట్ ద్వారా మిగిలిన డబ్బులను ఇంటి అవసరాలకు ఖర్చు చేసుకుంటామని సదరు మహిళలు తెలుపుతూ వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈరోజు ఆదివారం కావడంతో మహిళలంతా వారి వారి ప్లాన్స్ తో బిజీ అయిపోయారు. నిన్న రెండో శనివారం సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో మహిళలు ప్రయాణించారని అధికారులు చెప్పుకొచ్చారు. చాలా బస్సుల్లో సగటున 45 మంది ప్రయాణికులు పెరిగినట్లు తెలిపారు. ఇక ఈరోజు ఆదివారం కావడం తో బస్టాండ్ లన్ని కూడా మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. బస్సు లో ప్రయాణించేందుకు పోటీ పడుతున్నారు. అధికారులు సైతం ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని అదనపు బస్సు లను పెంచారు.

Read Also : CM Revanth : కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి