Road Accident: ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బ‌స్సు.. మంత్రి కేటీఆర్ ఆరా

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బ‌స్సు వెన‌క నుంచి ఢీ (Road Accident) కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో స్కూల్ బస్‌లోని పలువురు విద్యార్థులకు గాయాల‌య్యాయి. ఆర్టీసీ బస్సులో ఉన్న ఇద్దరు స్వల్ప గాయాలతో బ‌య‌ట‌ప‌డ్డారు.

  • Written By:
  • Updated On - January 31, 2023 / 11:47 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బ‌స్సు వెన‌క నుంచి ఢీ (Road Accident) కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో స్కూల్ బస్‌లోని పలువురు విద్యార్థులకు గాయాల‌య్యాయి. ఆర్టీసీ బస్సులో ఉన్న ఇద్దరు స్వల్ప గాయాలతో బ‌య‌ట‌ప‌డ్డారు. ఆ స‌మ‌యంలో బ‌స్సులో 20 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. బ‌స్సు వేగంగా ఢీ కొట్ట‌డంతో స్కూల్ బ‌స్సులోని పిల్ల‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌తో స్కూలు చిన్నారుల త‌ల్లిదండ్రులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. వారిని చూసేందుకు ఆసుప‌త్రి వ‌ద్ద‌కు చేరుకున్నారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Also Read: Nalgonda Politics: కోవర్ట్ కోమటిరెడ్డి.. నల్లగొండలో పోస్టర్ల కలకలం

మంత్రి కేటీఆర్ ఆరా

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో ఫోన్లో మాట్లాడారు. గాయపడిన విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమైతే హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు.