Bus Accident : మేడారం వెళ్తోన్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు

మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతర (Medaram Jatara)కు 50 మంది ప్రయాణికులతో వెళ్తేన్న ఆర్టీసీ బస్సు (RTC Bus)ను బొగ్గు లారీ ఢీకొట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను భూపాలపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ తో పాటుగా లారీ డ్రైవర్ […]

Published By: HashtagU Telugu Desk
Bus Accident (1)

Bus Accident (1)

మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతర (Medaram Jatara)కు 50 మంది ప్రయాణికులతో వెళ్తేన్న ఆర్టీసీ బస్సు (RTC Bus)ను బొగ్గు లారీ ఢీకొట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను భూపాలపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ తో పాటుగా లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ సంఘటన గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటే.. మేడారం మహా జాతరకు వెళ్లే దారిలో చాలా ప్రమాదకరమైన మలుపులు, జంక్షన్లు ఉన్నాయని, వీటి వద్ద జాగ్రత్తగా వెళ్లాలని పోలీసు శాఖ వెల్లడించింది. అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొంది పోలీసు శాఖ. సమ్మక్క, సారలమ్మ జాతరకు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌‌గఢ్‌‌, ఒడిశా రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. అయితే నేడు కీలకఘట్టంతో జాతర ప్రారంభం కానుండటంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా.. అధిక సంఖ్యలో వాహనాలు మేడారం వైపుకు వస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ రూట్లలో ఒక్క వెహికల్​ ఆగినా కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ స్థంభించిపోయే పరిస్థితి ఉండటంతో.. అలా జరుగకుండా ముందే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు పోలీసులకు కత్తి మీద సాములా మారుతోంది. మూలమలుపులు, రోడ్డు క్రాసింగ్స్, ముఖ్యమైన జంక్షన్ల వద్ద వెహికల్స్ ను వేగంగా నడపవద్దని, ఓవర్‌ టేక్‌‌ చేయొద్దని పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు. వన్‌‌వే రూల్స్‌‌ అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
Read Also : Tummala Nageswara Rao : అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది

  Last Updated: 21 Feb 2024, 11:47 AM IST