RS Praveen Kumar: ఒకే రోజు మూడు పరీక్షలు ఎలా రాస్తారు: RS ప్రవీణ్ కుమార్

ఏప్రిల్ 30న జరగనున్న పోలీస్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ కమ్యూనికేషన్, జూనియర్ లైన్ మెన్ పరీక్షల నిర్వహణ

RS Praveen Kumar: ఏప్రిల్ 30న జరగనున్న పోలీస్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ కమ్యూనికేషన్, జూనియర్ లైన్ మెన్ పరీక్షల నిర్వహణపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఒకేరోజు మూడు పరీక్షలు ఎలా రాస్తారు అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. పరీక్ష తేదీలను మార్చాలంటూ సీఎంఓ ను డిమాండ్ చేశారు.

ఈ నెల 30వ తేదీన తెలంగాణాలో పోలీస్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ కమ్యూనికేషన్, జూనియర్ లైన్ మెన్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఈ సెక్టార్లలో ఖాళీలు ఉన్నందున భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఒకే రోజు మూడు పరీక్షలు నిర్వహిస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకేరోజు మూడు పరీక్షలు నిర్వహణ ప్రభుత్వానికి పెద్ద కష్టమేమి కాదు కానీ నిరుద్యోగులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన మూడు పరీక్షలను ఒకే రోజు కాకుండా తేదీలను మార్చాలంటూ డిమాండ్ చేశారు. సీఎంఓ ( CMO ) నిరుద్యోగులతో ఆడుకోవద్దంటూ మండిపడ్డారు.

పరీక్ష విధానంలో ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు:
. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి లభించదు.
. హాలులో అభ్యర్థుల డిజిటల్‌ వేలిముద్రలు ఇవ్వాల్సి ఉంటుంది .
. ఎవరి వస్తువులకు వారే బాధ్యులు. పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థుల సామగ్రి భద్రపరుచుకునే సదుపాయం లేదు.
. ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు.
. హాల్‌టికెట్లను నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకూ భద్రపరచుకోవాలి.

Read More: Delhi Deals : సోనియా చెప్పింది నిజ‌మైతే.. రేవంత్ ఔట్