Konaseema Violence : తెలంగాణకు కోన‌సీమ విధ్వంసం

ఏపీలోని కోన‌సీమ విధ్వంసం తెలంగాణ వ‌ర‌కు చేరింది. ద‌ళితుల‌పై జరుగుతోన్న సామాజిక దాడిని బీఎస్సీ తెలంగాణ క‌న్వీన‌ర్ ఆర్.ఎస్. ప్ర‌వీణ్ కుమార్ గ‌మ‌నించారు.

  • Written By:
  • Publish Date - May 26, 2022 / 02:10 PM IST

ఏపీలోని కోన‌సీమ విధ్వంసం తెలంగాణ వ‌ర‌కు చేరింది. ద‌ళితుల‌పై జరుగుతోన్న సామాజిక దాడిని బీఎస్సీ తెలంగాణ క‌న్వీన‌ర్ ఆర్.ఎస్. ప్ర‌వీణ్ కుమార్ గ‌మ‌నించారు. అమ‌లాపురం విధ్వంసం లెక్క‌లు చాలా ఉన్నాయని బీఎస్పీ తెలంగాణ క‌న్వీన‌ర్ ఆర్.ఎస్. ప్ర‌వీణ్ కుమార్ అంటున్నారు. దేశంలోని ప‌లు చోట్ల గాంధీ, నెహ్రూ పేర్లు ఉన్న‌ప్ప‌టికీ ఎలాంటి రియాక్ష‌న్ ద‌ళితుల నుంచి రాలేదు. కానీ, కోన‌సీమ జిల్లాకు అంబేద్క‌ర్ పేరును జోడించ‌డం జ‌నాభాలో 10శాతం మందికి ఇష్టంలేద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. జ‌నాభాలో 90శాతం మంది ఉన్న ద‌ళితుల ఆరాధ్యునిగా ఉన్న అంబేద్క‌ర్ పేరు వినిపిస్తే అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతున్నార‌ని ట్వీట్ చేయడం గ‌మ‌నార్హం.

ఏపీలోని అమ‌లాపురం కేంద్రంగా చోటుచేసుకున్న అల్ల‌ర్లు ఇప్పుడు తెలుగు రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయాయి. అమ‌లాపురం అల్ల‌ర్లు మీ ప‌నేనంటూ అధికార ప‌క్షంపై విప‌క్షాలు ఆరోపిస్తుంటే, కాదు అవి విప‌క్షాల ప‌నేనంటూ వైసీపీ ప్ర‌తిస్పందిస్తోంది. ఇలాంటి నేప‌థ్యంలో బీఎస్పీ తెలంగాణ క‌న్వీన‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన నాటి నుంచి ప్ర‌భుత్వాలు ప‌లు స్కీములు, రోడ్లు, పార్కులు, డ్యాంల‌కు గాంధీ, నెహ్రూల పేర్లు పెట్టినా జ‌నాభాలో 90 శాతం మంది ఉన్న బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలు మౌనంగానే ఉన్నాయ‌ని ప్ర‌వీణ్ కుమార్ తెలిపారు. ఇప్పుడు కేవ‌లం ఒక కోన‌సీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్క‌ర్ పేరు పెడితేనే ఎలా వ్య‌తిరేకిస్తున్నారంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ దిశ‌గా చాలా లెక్క‌లే తేలాల్సి ఉన్నాయంటూ ఆయ‌న ట్వీట్ చేశారు.

స్థానికంగా నెల‌కొన్న ప‌లు అంశాల‌ను ప‌రిశీలించిన ప్ర‌వీణ్ కుమార్ అల్ల‌ర్ల వెనుక కార‌ణాల‌ను తెలుసుకున్నారు. అమ‌లాపురంలోని ఒక పార్కుకు అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌ని చాలా కాలంగా ద‌ళితులు కోరుతున్నారు. ఆ ప్ర‌య‌త్నం చేసిన వాళ్ల‌పై కాపు సామాజిక‌వ‌ర్గంకు చెందిన కొంద‌రు వ్య‌తిరేకించారు. కొంత కాలంగా ఆ విష‌యం ఇరు వ‌ర్గాల మ‌ధ్య సీరియ‌స్ గా న‌లుగుతోంది. తాజాగా కోన‌సీమ జిల్లాకు అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాగా నామ‌క‌ర‌ణం చేయ‌డంతో వివాదం నెల‌కొంది. ఫ‌లితంగా క‌ర్ర‌లు, రాడ్ల‌తో రోడ్ల మీద‌కు ఒక వ‌ర్గం వ‌చ్చింది. పోలీసుల‌ను వెంబ‌డించి కొట్ట‌డ‌మే కాకుండా రాళ్లు రువ్వారు. విధ్వంసానికి పాల్ప‌డ్డారు. ఇదంతా ఒక ఐపీఎస్ గా ప్ర‌వీణ్ కుమార్ స‌మాచారాన్ని సేక‌రించ‌డం పెద్ద కష్టం కాదు. అందుకే, రోడ్లు,పార్కుల పేర్లంటూ ఉటంకించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా అమ‌లాపురం ద‌ళితుల‌కు మ‌ద్ధ‌తు ఇచ్చేలా ట్వీట్ చేశారు. జ‌న‌సేన కు చెందిన కొంద‌రు కాపు సామాజిక‌వ‌ర్గం చేసిన విధ్వంసంగా ఫోక‌స్ అవుతోంది. కానీ, ఆ పార్టీ చీఫ్ ప‌వ‌న్ మాత్రం ఖండిస్తున్నారు. ప్ర‌స్తుతం విచార‌ణ జ‌రుగుతోన్న క్ర‌మంలో ప‌క్క‌నే ఉన్న రావుల పాలెం వ‌ర‌కు విధ్వంసం ప్ర‌భావం ప‌డింది. అక్క‌డ కూడా ఉద్రిక్త‌త నెల‌కొంది. ఇదంతా జ‌న‌సేన బ్యాచ్ చేస్తోన్న వ్య‌వ‌హారంగా వైసీపీ హైలెట్ చేస్తోంది. నిజా నిజాల‌ను తెలంగాణ బీఎస్పీ క‌న్వీన‌ర్ ప్ర‌వీణ్ కుమార్ స‌హా ప‌లువురు బ‌హుజ‌న పార్టీల నాయ‌కులు గ‌మ‌నిస్తున్నారు.

సామాజిక న్యాయం కోసం తెలంగాణ నుంచి కోన‌సీమ‌కు వెళ్లి మ‌ద్ధ‌తుగా నిల‌వాల‌ని కొంద‌రు భావిస్తున్నారు. బ‌హుశా స్వారోల‌ను తీసుకుని ప్ర‌వీణ్ కుమార్ అక్క‌డ‌కు వెళ్లే అవ‌కాశం లేక‌పోలేదు. ఆయ‌న‌తో పాటు మిగిలిన పార్టీల లీడ‌ర్లు కూడా ఏపీకి వెళ్లి అమ‌లాపురం విధ్వంసంపై సామాజిక పోస్ట్ మార్టం చేయ‌డం ద్వారా రాజ‌కీయ ల‌బ్దిపొందాల‌ని ప్ర‌య‌త్నస్తున్నారు. అదే జ‌రిగితే, కోన‌సీమ జిల్లా మ‌రో క‌శ్మీర్ గా ఇత‌ర ప్రాంతాల‌కు ఫోక‌స్ అయ్యే ఛాన్స్ ఉంది.