RS Praveen Kumar : తెలంగాణలో BSP పార్టీ భారీ బహిరంగసభ.. హైదరాబాద్‌కు మాయావతి

మే 7న BSP ఆధ్వర్యంలో తెలంగాణ భరోసా సభ హైదరాబాద్ సరూర్ నగర్ గ్రౌండ్స్ లో భారీగా జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ కుమారి మాయవతి హాజరుకానున్నారు.

  • Written By:
  • Updated On - April 25, 2023 / 11:10 PM IST

మరికొద్ది నెలల్లో తెలంగాణ(Telangana)లో ఎలక్షన్స్(Elections) ఉండటంతో ఇప్పటినుంచే ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయింది. అన్ని పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు బహిరంగ సభలు, యాత్రలు నిర్వహిస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఇటీవలే BJP చేవెళ్లలో విజయ సంకల్ప సభ పేరుతో భారీ సభ నిర్వహించింది. త్వరలో BSP పార్టీ హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు.

BSP నేత RS ప్రవీణ్ కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. మే 7న BSP ఆధ్వర్యంలో తెలంగాణ భరోసా సభ హైదరాబాద్ సరూర్ నగర్ గ్రౌండ్స్ లో భారీగా జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ కుమారి మాయవతి హాజరుకానున్నారు అని తెలిపారు.

అలాగే అమిత్ షా చేవెళ్ల పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై RS ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ.. అమిత్ షాకు రిజర్వేషన్లపై అవగాహన లేదు. మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేయాలనడం దారుణం. సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా, PS కృష్ణన్ కమిటీ ముస్లిం స్థితిగతులపై పరిశోధన జరిపిన అనంతరం రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించింది. రిజర్వేషన్లు మతం పేరిట ఇచ్చినవి కాదు. కేంద్ర హోం మంత్రికి ఈ మాత్రం తెలవకుండా ఎలా ఉన్నారో అర్థం కావడం లేదు. మైనారిటీలలో 136 కులాలు ఉన్నాయి. వీటిలో అనేక మంది కూలీ పని చేసుకుంటూ గడుపుతున్నారు. దేశాన్ని రక్షించాల్సిన హోం మంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. రిజర్వేషన్ల తొలగింపు ప్రకటనను BSP ఖండిస్తుంది. వెంటనే అమిత్ షా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అని అన్నారు.