Site icon HashtagU Telugu

Rs 850 Crores Scam: హైదరాబాద్‌లో రూ.850 కోట్ల స్కామ్‌.. పోంజి స్కీమ్‌‌తో కుచ్చుటోపీ

Rs 850 Crores Scam Hyderabad Ponzi Scheme Falcon Invoice Discounting Capital Protection Force Private

Rs 850 Crores Scam:  ఇటీవలి కాలంలో పోంజి స్కీమ్‌‌లతో స్కామ్‌లు పెద్దసంఖ్యలో జరుగుతున్నాయి. ప్రజలు అధిక లాభాలు, భారీ వడ్డీ ఆదాయం కోసం ఆశపడి పోంజి స్కీమ్‌‌లలో తమ కష్టార్జితం మొత్తాన్ని పెట్టుబడి పెడుతున్నారు. చివరకు పోంజి స్కీమ్‌ల నిర్వాహకులు బిచాణా ఎత్తేశారని తెలుసుకొని లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు. తాజాగా దాదాపు రూ.850 కోట్ల పోంజి స్కీమ్ స్కాం హైదరాబాద్ నగరం పరిధిలో వెలుగుచూసింది. వివరాలివీ..

Also Read :Koneru Konappa : కోనేరు కోనప్ప ఏం చేయబోతున్నారు ? ఆయన మాటలకు అర్థం అదేనా ?

రూ.1,700 కోట్ల డిపాజిట్లు సేకరించి..

పోంజి స్కీంను నడిపి  క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెద్ద స్కాం చేసింది. ‘ఫాల్కన్‌ ఇన్వాయిస్‌ డిస్కౌంటింగ్‌’ పేరుతో 2021 సంవత్సరం నుంచి పోంజి స్కీంను నడిపి జనాన్ని నట్టేట ముంచారు. ఏజెంట్లను పెట్టుకొని మరీ అమాయకుల నుంచి పెట్టుబడులను సేకరించి చీట్ చేశారు. ఈక్రమంలో ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించి మరీ.. జనం నుంచి డబ్బులు వసూలు చేశారు. ‘‘45 నుంచి 180 రోజుల్లోనే 11 నుంచి 22 శాతం దాకా లాభాలు వస్తాయి’’ అంటూ ప్రజలను నమ్మించారు. పెద్దఎత్తున పెట్టుబడులను స్వీకరించారు. పోంజి స్కీమ్ నిర్వాహకుల మాయ మాటలు నమ్మిన 6,979 మంది దాదాపు రూ.1,700 కోట్ల డిపాజిట్లు చేశారు. వీరిలో ఒక్కొక్కరి వద్ద నుంచి కనిష్ఠంగా రూ.25 వేల నుంచి గరిష్ఠంగా రూ.9 లక్షల దాకా పెట్టుబడులను తీసుకున్నారు.

Also Read :Purandeswari: పురందేశ్వరికి ఢిల్లీ నుంచి పిలుపు.. ఏపీ బీజేపీలో ఏం జరగబోతోంది ?

14 షెల్ కంపెనీలకు నిధులు..

కట్ చేస్తే..  ఈ ఏడాది జనవరి 15న  క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బిచాణా ఎత్తేసింది. దీంతో బాధితులంతా లబోదిబోమంటూ సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. తమ డబ్బును ఎలాగైనా ఇప్పించాలని వేడుకున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెండ్ పవన్ కుమార్ ఓదెల, డైరెక్టర్ కావ్య నల్లూరిని అరెస్ట్ చేశారు. పట్టుపడిన ఇద్దరూ అమర్ దీప్ కుమార్, అర్యాన్ సింగ్, యుగంధర్ సింగ్ అనే ప్రధాన నిందితులతో కలిసి డబ్బులను వసూలు చేశారని తేలింది. వీరంతా సేకరించిన రూ.1,700 కోట్లలో రూ.850 కోట్లను తిరిగి చెల్లించారని, మిగతా రూ.850 కోట్లను(Rs 850 Crores Scam) 14 షెల్ కంపెనీలకు దారి మళ్లించారని అంటున్నారు.