Site icon HashtagU Telugu

Rs 500 Gas Cylinder : వచ్చే నెల నుంచే ఆ రెండు పథకాలు అమల్లోకి !

LPG Cylinders

14 Kg Lpg Gas Cylinder Price Today

Rs 500 Gas Cylinder : తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు మరో రెండు స్కీమ్‌లను త్వరలోనే అమల్లోకి తేనుంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాలు వచ్చే నెల నుంచే అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎక్కువ దరఖాస్తులు  ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సిలిండర్(Rs 500 Gas Cylinder), మహిళలకు ప్రతినెలా రూ.2500 సాయం కోసమే వచ్చాయి.  ఇప్పటికే ప్రజాపాలనలో(డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు) స్వీకరించిన ఐదు గ్యారెంటీల దరఖాస్తుల డేటీ ఎంట్రీ దాదాపు పూర్తి కావచ్చింది. ప్రస్తుతం ఆధార్ కార్డులు, రేషన్ కార్డులను క్రోడీకరించి దరఖాస్తులోని సమాచారాన్ని పోల్చి చూస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సమాచారాన్ని క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసేందుకు ప్రత్యేక టీంలు రెడీ అవుతున్నాయి. ఈ టీమ్‌లు జనవరి 18 నుంచి వార్డు, గ్రామాల  స్థాయిలో పర్యటించి.. దరఖాస్తులోని  డేటా ఆధారంగా దరఖాస్తుదారుల వివరాలను సరిపోలుస్తారు. దరఖాస్తుదారుల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేస్తారు. ఈ వివరాలను ప్రభుత్వానికి సమర్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 16 వేలకు పైగా గ్రామాలు, 710 మున్సిపల్ వార్డుల పరిధిలోని కోటి 11 లక్షల 46 వేల 293 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో ఐదు గ్యారెంటీలకు 1.05 కోట్ల దరఖాస్తులు రాగా.. రేషన్ కార్డులు, భూ సమస్యల పరిష్కారాల కోసం 19 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రేషన్ కార్డులకు సంబంధించి డిజిటల్ ఎంట్రీని అధికారులు పక్కకు పెట్టేశారు. దీంతో రేషన్ కార్డు కోసం ఎదురు చేస్తున్నవారికి మరోసారి నిరాశ తప్పడం లేదు.

Also Read: Udaya Bhanu : యాంకర్‌గా ఉదయభాను రీఎంట్రీ.. ‘సూపర్ జోడీ’ షో వివరాలివీ

ఆరు గ్యారంటీలకు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే ఎలాంటి ఆందోళన చెందొద్దని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. రెవెన్యూ, మున్సిపల్, జోనల్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చని స్పష్టం చేసింది. ఇంకా తుది గడువును నిర్ణయించలేదని, కాబట్టి అర్హత ఉన్నవారు ఎవరైనా ఉంటే ఈ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఈ పథకాలకు అర్హులను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ అప్లికేషన్లను ఆన్ లైన్లో అప్లోడ్ చేస్తోంది. ప్రజాపాలన పేరుతో ప్రత్యేక వెబ్ సైట్ ను ఏర్పాటు చేసి అందులో వివరాలను అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దాదాపు 50 శాతం దరఖాస్తులను ఆన్ లైన్లో అప్ లోడ్ చేసినట్లు తెలుస్తోంది. మిగతా దరఖాస్తులను కూడా త్వరగా అప్లోడ్ చేసి అసలైన అర్హులు ఎవరో గుర్తించేందుకు ప్రతి ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేయనుంది. అనంతరం అప్లికేషన్ స్టేటస్ ను ప్రజాపాలన వైబ్ సైట్లో అందుబాటులో ఉంచే అవకాశాలున్నాయి. మీ దరఖాస్తు సంఖ్యను ఎంటర్ చేస్తే మీ స్టేటస్ తెలిసిపోతుంది. మరికొద్ది రోజుల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.