CM Revanth : అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం శాన్‌ఫ్రాన్సిస్కోలో గూగుల్ కంపెనీకి చెందిన వేమో (Waymo) డ్రైవర్‌లెస్ కారులో ప్రయాణించారు. డ్రైవర్ లేకుండానే ఆ కారు నడుస్తుండటాన్ని ఆయన నిశితంగా పరిశీలించారు. వేమో కారులో తెలంగాణ మంత్రి డి.శ్రీధర్ బాబు కూడా ప్రయాణించి, దానిలో జర్నీ ఎలా ఉందనే విషయాన్ని ప్రత్యక్షంగా చూశారు.
We’re now on WhatsApp. Click to Join
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) అమెరికా పర్యటన విజయవంతమైంది. ఈ పర్యటనలో తెలంగాణ కోసం రూ.31532 కోట్ల పెట్టుబడులను సాధించగలిగారు. దాదాపు 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో 30750 కొత్త ఉద్యోగాల కల్పన జరగనుంది. అమెరికా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా ప్రకటించడం, హైదరాబాద్‌ను 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు ఎంచుకున్న వివిధ ప్రాజెక్టుల గురించి తెలుసుకొని అమెరికా కంపెనీలు ప్రభావితమయ్యాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కూడిన ప్రభుత్వ అధికారుల బృందం ఈనెల 3న అమెరికా పర్యటనకు బయలుదేరింది. అప్పటి నుంచి సీఎం సారథ్యంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాలో దాదాపు యాభైకి పైగా బిజినెస్ మీటింగ్‌లలో పాల్గొంది.
Also Read :Varalakshmi Vratham 2024: గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా.. పండితులు ఏం చెబుతున్నారంటే!
ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు ఆసక్తిని చూపాయి. కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసియం కార్నింగ్, అమెజాన్, జొయిటిస్, హెచ్‌సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. హైదరాబాద్‌లో తమ డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి బృందం ఈ పర్యటనలో భాగంగా యాపిల్ కంపెనీ, గూగుల్ కంపెనీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో పాటు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ చర్చలు జరిపింది.
Also Read :Gobi Manchuriya: గోబీ మంచూరియా అంటే ఇష్టమా.. ఇది ఆరోగ్యానికి మంచిదేనా?
శనివారం అమెరికా పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ దక్షిణ కొరియాకు బయలుదేరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలో పేరొందిన కంపెనీలతో సంప్రదింపులు జరిపి తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికింది. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు తమ ప్రభుత్వం ఎంచుకున్న ప్రణాళికలకు అమెరికాలోని పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించింది. తెలంగాణ అభివృద్ధికి దోహదపడేలా ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు తరలిరావటం శుభసూచకం’’ అని పేర్కొన్నారు. అమెరికా వ్యాపార సామ్రాజ్యాలకు తెలంగాణను సరికొత్తగా పరిచయం చేయగలిగామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్రంలో వివిధ రంగాల పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం అందించే సహకారాన్ని చాటిచెప్పేందుకు ఈ పర్యటన సత్ఫలితాలను అందించిందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల రాష్ట్రానికి పెట్టుబడులతో పాటు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.