I am responsible for handloom loan waiver : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ నాంపల్లి లలితా కళాతోరణంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(IIHT) ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ ముఖ్యంగా రూ.30 కోట్ల చేనేత రుణ మాఫీ బాధ్యత నాది. రుణమాఫీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రెటరీకి ఆదేశాలిస్తున్నా.. రుణమాఫీ వార్తతో నేతన్నలు సంతోషంగా ఇంటికెళ్లి.. కడుపునిండా భోజనం చేయాలి. ఇందిరమ్మ ప్రభుత్వంలో చేతి, కుల వృత్తులకు సముచిత న్యాయం జరుగుతుందని తెలిపారు. అలాగే IIHT విద్యార్థులకు నెలకు రూ.2500 ప్రోత్సాహకం అందించారు. ఇందుకోసం రూ.290 కోట్ల నిధులను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే మహిళలకు ప్రతీ ఏడాది రెండు చీరలను ఇవ్వనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో దాదాపు స్వయం సహాయక, సెల్ప్ హెల్ప్ గ్రూపుల్లో దాదాపు 63 లక్షల మంది ఉన్నారని.. వారందరికీ ఏడాదికి రెండు చీరలను చేనేత కార్మికులు నేస్తారని వెల్లడించారు.
రాష్ట్రంలో ఉన్న 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు సంవత్సరానికి రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించాం సీఎం రేవంత్ రెడ్డి #RevanthReddy #Handloom #Telangana #HashtagU pic.twitter.com/2NUwbvNdFa
— Hashtag U (@HashtaguIn) September 9, 2024
గత ప్రభుత్వం కేవలం ఆర్భాటాలకే పరిమితం..సీఎం
పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. తెలంగాణకు ఐఐహెచ్‌టీ తీసుకురాకుండా నిర్లక్ష్యం చేసిందని అసహనం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే ప్రధాని మోడీతో పాటు అనేకమంది కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. తాము కోరిన వెంటనే తెలంగాణకు ఐఐహెచ్‌టీ మంజూరు చేశారని తెలిపారు. తాము కూడా సమయం వృథా చేయకుండా వెంటనే ప్రారంభించామని అన్నారు. బతుకమ్మ చీరలకు ఆర్డర్లు ఇచ్చారు.. కానీ, బకాయిలు చెల్లించలేదని మండిపడ్డారు. తాము వచ్చిన వెంటనే కార్మికులకు బకాయిలు చెల్లించామని వెల్లడించారు. గత ప్రభుత్వం కేవలం ఆర్భాటాలకే పరిమితం అయింది తప్పా.. నేతన్నలకు ఏనాడూ ఆడుకోలేదని అన్నారు. తమ ప్రభుత్వం నేతన్నలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నేతన్నలకు తాము రూ.30 కోట్ల రుణమాఫీ చేస్తామని అన్నారు. కుల, చేతి వృత్తులు సముచిత న్యాయం చేస్తాం అని రేవంత్ రెడ్డి తెలిపారు.
మరోవైపు గత ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకాన్ని రేవంత్ ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది. అయితే, ప్రభుత్వం ఆర్డర్లు లేకపోవడంతో నేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో బతుకమ్మ చీరల ఆర్డర్లకు సంబంధించి కార్మికులకు ప్రభుత్వం ఇంకా బిల్లులు చెల్లించాల్సి ఉందని కార్మికులు ఆరోపిస్తున్నారు. సత్వరమే బిల్లులు విడుదల చేయడమే కాకుండా ప్రభుత్వం తరఫున ఆర్డర్లు ఇచ్చితమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.