సీఎం కేసీఆర్ (CM KCR) మైనారిటీలకూ (Minorities) తీపి కబురు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త కొత్త పథకాలు తీసుకొస్తూ ప్రజలను ఆకట్టుకునేపనిలో పడ్డారు సీఎం కేసీఆర్. ఇప్పటీకే రాష్ట్రంలో దళితుల కోసం దళిత బంధు , కులవృత్తుల కోసం బీసీ బంధు తీసుకొచ్చిన కేసీఆర్..ఇప్పుడు మైనారిటీలకూ లక్ష సాయం (Rs 1 Lakh Assistance ) అందించబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా మైనారిటీల ఆర్థిక స్వావలంబన దిశగా దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని కేసీఆర్ సర్కార్ ఆవిష్కరించినట్లు అయ్యింది.
ఈ సందర్భాంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదన్నారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వున్నదని సీఎం స్పష్టం చేసారు. విద్య, ఉపాధి సహా పలు రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనార్టీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు కృషి కొనసాగుతున్నదన్నారు.
ఇక ఈ మైనార్టీలకు లక్ష రూపాయల పథకానికి సంబంధించిన విధి విధానాలు త్వరలోనే విడుదల కానున్నాయి. దీనికి కూడా బీసీ బంధు(BC Bandhu Ccheme) మాదిరిగానే కండీషన్లు ఉండే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఎలాంటి నిబంధనలు పెట్టనున్నారో తెలియాల్సి ఉంది. కాగ.. మైనార్టీల కోసం ప్రభుత్వం లక్ష స్కీమ్ పథకాన్ని తీసుకొచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.
Read Also : Diet Charges Hike: విద్యార్థులకు శుభవార్త…డైట్ చార్జీల ఫైల్ పై సంతకం చేసిన సీఎం కేసీఆర్