Site icon HashtagU Telugu

Rowdy Sheeter Murder : బహదూర్‌పురాలో రౌడీషీటర్ దారుణ హ‌త్య‌

hyd murder

hyd murder

హైదరాబాద్ బ‌హదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రౌడీ షీట‌ర్ దారుణ హ‌త్య‌కు గురైయ్యాడు.  హసన్‌నగర్‌లో బుధవారం రాత్రి రౌడీషీటర్‌ను నరికి చంపిన ఘటన కలకలం రేపింది. రాజేంద్ర నగర్‌కు చెందిన 38 ఏళ్ల బాబూ ఖాన్ అనే రౌడీ షీటర్ అతని ప్రత్యర్థి వర్గం చేతిలో హ‌త్య‌కు గురైన‌ట్లు తెలుస్తోంది. హోటల్ ముందు అందరూ చూస్తుండగానే దుండ‌గులు కత్తులతో పొడిచి చంపారు. ఈ ఘ‌ట‌న‌లో అక్క‌డిక‌క్క‌డే బాబూఖాన్ మృతి చెందాడు. హుటాహుటిన సంఘటన స్థలానికి బహదూర్ పూరా పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాబూఖాన్ పై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఉంది. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జ‌రిగిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.రంగంలోకి దిగిన డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీమ్ బృందాలు. పలు ఆధారాలు స్వేకరించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.