Site icon HashtagU Telugu

HYD Restaurant : రెస్టారెంట్లో కుళ్లిన ఆహారం, ఎలుకల మలం!

Absolute Barbecues Restaura

Absolute Barbecues Restaura

హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్ అయిన అబ్సల్యూట్ బార్బెక్యూ(Absolute barbecues Restaurant)పై ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. నిన్న జరిగిన ఈ దాడుల్లో వెలుగులోకి వచ్చిన విషయాలు విని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పది బ్రాంచుల్లో జరిగిన ఈ తనిఖీల్లో వంటగది అపరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఎలుకల మలం, బొద్దింకలు, కుళ్లిన ఆహార పదార్థాలు వంటివి చూసి అధికారులు షాక్ అయ్యారు.

AP : డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటుపై నిషేధం లేదు: ఏపీ హైకోర్టు

వంటగదిలో ఫ్రిడ్జ్‌లు, పాత్రలు, వంట సామాగ్రి మొత్తం అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ రెస్టారెంట్ వినియోగదారులకు అందిస్తున్న ఆహారం సురక్షితం కాదని అధికారులు తేల్చారు. కిచెన్ ర్యాక్స్ మీద ఎలుకల మలం, ఫ్రిడ్జ్ లో కుళ్లిపోయిన పండ్లు, కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించారు. ఈ తనిఖీల్లో బహిర్గతమైన విషయాలు ప్రజారోగ్యానికి పెను ముప్పుగా మారే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, అబ్సల్యూట్ బార్బెక్యూ రెస్టారెంట్‌కు నోటీసులు జారీ చేసి కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ సంఘటన ఇతర రెస్టారెంట్లకు ఒక హెచ్చరికగా నిలుస్తుందని, భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రజలు కూడా బయట తినేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రత విషయంలో అనుమానం ఉంటే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.