Site icon HashtagU Telugu

Revanth Vs Ktr: గులాబీ బాస్ సైలెంట్…రేవంత్ టార్గెట్ ఆ ఇద్దరే..!

Revanth Vs Kcr

Revanth Vs Kcr

Cm Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ అధినేత కేసీయార్ (KCR) సైలెంట్ అయ్యారు. ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం, మంచి వాగ్దాటి కల్గిన కేసీఆర్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటంతో ఆ బాధ్యతను కేటీఆర్ (KTR), హరీష్ రావులు (Harish Rao) మోస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని (Congress) ముప్పుతిప్పలు పెడుతున్నారు.. దీంతో వారికి చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన వ్యూహాలకు పదును పెట్టారు.

గత ఎనిమిది నెలలుగా కాంగ్రెస్ పార్టీపై బావ, బామర్దులే పోరాటం చేస్తున్నారు..చీమ చిటుక్కుమన్నా.. ప్రెస్ మీట్లు (Press Meets) పెట్టి సీఎం రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) విమర్శల వర్షం కురిపిస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీకి కంటిలో నలుసుగా మారిన బావ, బామర్దులపై అప్పర్ హ్యాండ్ (Upper Hand) సాధించేందుకు రేవంత్ రెడ్డి మాష్టర్ ప్లాన్ (Master Plan) వేశారని ఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అర్దమవుతుంది.

పూర్తిగా రుణమాఫి (Runa Mafi) చేస్తే రాజీనామా చేస్తానంటూ హరీష్‌ రావు (Harish Rao) గతంలో ప్రకటించిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ (Congress Party) తాజాగా తెరమీదకు తీసుకొచ్చింది. తెలంగాణాలోని రైతుందరికీ రుణమాఫి చేశామని.. హరీష్ రావ్ ఎప్పుడు రాజీనామా చేస్తారో చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్లు (Demands) చేస్తున్నారు. ఈ రకంగా హరీష్‌ ను (Harish) ఇబ్బంది పెడితే.. సైలెంట్  అవుతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట.

మహిళలపై కేటీఆర్ (KTR) అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం వెనుక రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. కేటీఆర్ నోటికి తాళం వెయ్యాలంటే ఇదే సరైన సమయమని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. వీరిద్దరిని కట్టడి చేస్తే బీఆర్‌ఎస్ ను ఓ ఆట ఆడుకోవచ్చని సీఎం భావిస్తున్నారట. అందులో భాగంగానే… ఈ పరిణామాలన్ని జరుగుతున్నాయని పొలిటికల్ పండిట్స్ చెప్తున్న పరిస్థితి.