Site icon HashtagU Telugu

TS : ఆర్టీసీ బస్సు లో దొంగల చేతివాటం..కండక్టర్ బ్యాగులో డబ్బులు మాయం

Robbery In Rtc Bus

Robbery In Rtc Bus

తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..వచ్చి రావడంతోనే మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ ఫ్రీ పథకం పెట్టిన దగ్గరి నుండి ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. కాలుపెట్టే సందు లేకుండా ప్రయాణికులతో బస్సులు నడుస్తున్నాయి. ఇక సంక్రాంతి పండగవేళ చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది. ఫుట్ పాత్ ఫై కూడా నిల్చుని ప్రయాణం చేసారు. ఇదే క్రమంలో దొంగలు తమ చేతికి పని చెప్పారు. ఏకంగా కండక్టర్ బ్యాగుకే కణ్ణం పెట్టారు. ఈ ఘటన మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

మణుగూరు కు చెందిన బస్సు..ఖమ్మం నుంచి పాల్వంచ వెళుతుండగా టికెట్లు కొడుతున్న సమయంలో బాగా రద్దీ ఉంది. అదే సమయంలో దొంగలు కండక్టర్ బ్యాగులో ఉన్న రూ.9 వేలను మాయం చేశారు. ఈ విషయాన్ని గమనించిన బాధిత కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో బస్సులో 90 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. 90 మందిలో డబ్బులు ఎవరు కొట్టేశారనేది కనుకోవడం కష్టమే. ఇక బస్సులో దొంగతనాలు అనేది ఇప్పుడే కాదు గతంలో కూడా చాల జరిగాయి. కొంతమంది మహిళా ప్రయాణికుల మెడలోని బంగారాన్ని దోచుకోవడం, జేబులో డబ్బులు కొట్టేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు కండక్టర్ లను టార్గెట్ చేస్తూ ఉన్నారు దొంగలు.

Read Also : Salaar OTT: ఓటీటీలో సందడి చేస్తున్న సలార్ మూవీ, నెటిజన్స్ రెస్పాన్స్ సూపర్