Robbery in Bhatti House : తెలంగాణ డిప్యూటీ సీఎం(Deputy CM) భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఇంట్లో దొంగలు పడడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ గా మారింది. బంజారాహిల్స్‌లోని(Banjarahills) భట్టి నివాసంలో చోరీకి పాల్పడ్డారు దుండగులు. ఇంట్లో పలు విలువైన వస్తువులు ఎత్తికెళ్లినట్లు తెలిసింది. కేవలం వస్తువులు మాత్రమేనా..బంగారం , నగదు ఏమైనా ఎత్తుకెళ్లారా..? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దొంగతనం జరిగిందనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితులు బిహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం భట్టి అమెరికా పర్యటన బిజీ గా ఉన్నారు. ఈ పర్యటన లో భట్టి తన స్టయిల్ ను పూర్తి గా మార్చేశారు. ఎప్పుడూ తెల్లటి షర్టు, పంచా ధరించి తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే భట్టి.. అమెరికా పర్యటనలో సూట్ ధరించి భిన్నంగా కనిపిస్తున్నారు. కొన్ని సందర్భాలలో ఆయన జీన్స్ ప్యాంట్, కలర్స్ షర్ట్స్ ధరిస్తున్నారు. విదేశీ పర్యటనలో తమ అభిమాన నేత స్టైలిష్ దుస్తుల్లో కనిపించడంతో వారు ఖుషీ అవుతున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన హూవర్ డ్యామ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అమెరికా అధికారులు ప్రాజెక్టు గురించి భట్టికి వివరించారు. తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న 1931- 36 మధ్య ఈ ప్రాజెక్టును నిర్మించారని, దీని ద్వారా 2080 మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని తెలిపారు. నెవాడా, అరిజోన రాష్ట్రాల సరిహద్దులో కొలరాడో నదిపై నిర్మించిన హూవర్ జల విద్యుత్తు డ్యామ్‌ను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని జల విద్యుత్తు ప్రాజెక్టుల సామర్థ్యం పెంపుపై దృష్టి పెట్టాలని రాష్ట్ర అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు.
Read Also : KKR News Mentor: కేకేఆర్ మెంటార్‌గా వెస్టిండీస్ లెజెండ్ బ్రావో