Site icon HashtagU Telugu

Road Accidents in Telangana : ప్రాణాలు తీస్తున్న పొగమంచు ..

Road Accidents In Telangana

Road Accidents In Telangana

గత కొద్దీ రోజులుగా తెలంగాణ (Telangana) లో చలి విపరీతంగా పెరిగింది..ఉదయం 9 గంటలైనా చలి తగ్గడం లేదు. ముఖ్యంగా తెల్లవారుజామున పొగమంచు కారణంగా అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో చాలామంది నిద్రలోనే కన్నుమూస్తున్నారు. ఈరోజు సోమవారం పొగమంచు కారణంగా జరిగిన పలు ప్రమాదాల్లో (Accidents) ఆరుగురు మృతి (Dies) చెందారు. వికారాబాద్ జిల్లాలో పొగ మంచు కారణంగా శివారెడ్డిపేట్ చెరువులోకి కారు దూసుకెళ్లింది. హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు.వీరిలో నలుగురు సురక్షితంగా బయటపడగా.. ఒక్కరు గల్లంతయ్యారు. క్రేన్ సాయంతో కారును అధికారులు బయటకు తీశారు.

We’re now on WhatsApp. Click to Join.

నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు స్టేజి వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పొగమంచులో రోడ్ ఫై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఓ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి మృతి చెందాడు. ఇక పెద్దపూర మండలం మల్లెవాని కుంట తండాకు చెందిన వారంత ఆటోలో వేంపాడు వెళ్తుండగా.. పార్వతీపురం వద్ద ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఆయిల్ ట్యాంకర్‌ ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. ముగ్గురు స్పాట్‌లోనే మృతి మరో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇక మక్తల్ వద్ద మరో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జక్లెయిర్ వద్ద వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న కారు ఓవర్‌టేక్ చేసింది. ఈ ప్రయత్నంలో ఆ కారు ఎదురుగా వస్తున్న వెహికల్‌ను ఢీ కొట్టింది. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఇలా పండగపూట వరుస ప్రమాదాలు ఆయా కుటుంబాల్లో విషాదం నింపింది.

Read Also : Sradda Das : బికినీలో శ్రద్ద దాస్ అదిరిపోయే స్టిల్స్