Goa Bus Accident : గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం?

కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదం అందరి మనసులను కలచివేస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Goa Bus2

Goa Bus2

కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదం అందరి మనసులను కలచివేస్తోంది. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు గోవా నుంచి హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారం. ఈ బస్సు కలబురిగి జిల్లా కమలాపుర వరకు బాగానే వచ్చింది. కానీ ఆ ప్రాంతంలో ఓ మినీ లారీని ఈ బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా బ్యాలెన్స్ బోల్తా పడింది. దీంతో ఉన్నపళంగా బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అవి బస్సంతటికీ వేగంగా వ్యాపించాయి.

దూరప్రయాణం కావడం వారాంతం కావడంతో బస్సులో ప్రయాణికులు కూడా ఎక్కువమందే ఉన్నారు. ప్రమాదం జరిగే సమయానికి ఈ బస్సులో డ్రైవర్ తో పాటు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. కానీ ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడం, మంటల్లో చిక్కుకుపోవడం, బయటకు వెళ్లే దారి కనిపించకపోవడంతో బస్సులోనే ఏడుగురు ప్రయాణికులు సజీవ దహనమైనట్టు తెలుస్తోంది.

Goa Bus1

ప్రమాదం జరిగిన వార్త తెలుసుకుని.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు కష్టపడి 12 మందిని రక్షించగలిగారు. వెంటనే వారికి ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు వారికి చికిత్సను అందిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనలో మినీ లారీ డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మృతుల్లో తెలంగాణ వాసులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ప్రమాద వార్త తెలుసుకున్న తరువాత అక్కడ సహాయ చర్యలు ముమ్మరంగా చేపట్టారు.

Deceased :::

Arjun kumar
Sarala
Mukundrao
Khushi
Snehalatha
Kalpana

  Last Updated: 03 Jun 2022, 12:08 PM IST