Road Accident in Wanaparthy : వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – ఐదుగురు మృతి

వనపర్తి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తకోట సమీప జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి(Car Out of Control) చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందగా. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. బళ్లారి నుండి హైద్రాబాద్ కు కారులో వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం (Road Accident in Wanaparthy) […]

Published By: HashtagU Telugu Desk
Vanaparthi Road Accident

Vanaparthi Road Accident

వనపర్తి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తకోట సమీప జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి(Car Out of Control) చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందగా. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. బళ్లారి నుండి హైద్రాబాద్ కు కారులో వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదం (Road Accident in Wanaparthy) సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను(Injuries) సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో అబ్దుల్‌ రహమాన్‌ (62), సలీమా జీ (85), చిన్నారులు బుస్రా (2), మరియా (5), వాసిర్‌ రవుత్‌ (7 నెలలు) ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఒకే కుటుంబానికి చెందిన 12 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

సోమవారం తెల్లవారుజామున రెండున్నర నుంచి మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. డైవర్ నిద్రమత్తులో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా(Police Estimate) వేస్తున్నారు. కారు చెట్టుకు బలంగా ఢీ కొట్టడంతో ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయిందని .. అందులో చిక్కుకున్న చిన్నారుల మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు, ఎల్ అండ్ టీ సిబ్బంది గంటకుపైగా శ్రమించాల్సి వచ్చింది.

Read Also : Lok Sabha Elections 2024: మార్చి 12న కరీంనగర్ నుంచి కేసీఆర్ ప్రచారం

  Last Updated: 04 Mar 2024, 11:57 AM IST