నారాయణపేట (Narayanpet ) జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలానికి చెందిన భాషా (50), షికూర్ (50), వెంకట్రావు, ప్రశాంత్ లు గోవా నుండి కారులో తిరిగి వస్తుండగా మక్తల్ మండలం, గుడిగండ్ల గ్రామ సమీపంలో హైదరాబాద్ వైపు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేయబోయి వెనుక భాగంలో ఢీ కొట్టారు. దీంతో కారు ..లారీ ..వెనుకభాగంలో ఇరుక్కుంది. ఈ విషయం గమనించని లారీ డ్రైవర్ లారీని అర కిలోమీటర్లు పైగా ప్రమాదానికి గురైన కారుతో ముందుకు తీసుకెళ్లాడు.
ఇది చూసిన కొంతమంది లారీని ఓవర్టేక్ చేసి విషయాన్ని డ్రైవర్ కు చెప్పడం తో లారీని పక్కకు ఆపాడు. ఆ తర్వాత అక్కడినుండి పరారయ్యాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఇద్దరు మృతి చెంది ఉండగా, వెంకట్రావు తీవ్రంగా గాయపడగా.. డ్రైవర్ ప్రశాంత్ కు సీటు బెల్టు ఉండడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడిన వెంకట్రావును మహబూబ్ నగర్ జిల్లా హాస్పటల్ కు తరలించారు.
Read Also: Pune Shocker: దారుణం: భర్త ఎదురుగానే భార్యను అత్యాచారం