Hanamkonda : రోడ్డు క్రాస్ చేస్తుండగా స్కూల్ బస్సు ను ఢీ కొట్టిన కారు

హన్మకొండ – కమలాపూర్ రహదారిలో యూ టర్న్ తీసుకుంటున్న ఏకశిలా స్కూలు బస్సును (Bus Accident) వేగంగా కారు ఢీ కొట్టింది.

Published By: HashtagU Telugu Desk
Hnk Road Accident

Hnk Road Accident

శుక్రవారం ఉదయం హన్మకొండ – కమలాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తుండగా ఏకశిలా స్కూలు బస్సును కారు ఢీకొట్టింది.. ప్రమాద ధాటికి స్కూలు బస్సు బోల్తా పడడంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రమాదాలు ఆగడం లేదు. అతి వేగం ప్రమాదకరం అని పదే పదే చెప్తున్నప్పటికీ ఓవర్ స్పీడుతో వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు..అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం హన్మకొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

హన్మకొండ – కమలాపూర్ రహదారిలో యూ టర్న్ తీసుకుంటున్న ఏకశిలా స్కూలు బస్సును (Bus Accident) వేగంగా కారు ఢీ కొట్టింది. ప్రమాద ధాటికి స్కూలు బస్సు పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు (Students) ఉన్నారు. చిన్నారుల్లో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా కారులో ఉన్న ముగ్గురికి కూడా గాయాలు అయ్యాయి. బస్సు పల్టీ కొట్టిన వెంటనే సిబ్బంది అప్రమత్తమైంది. కిటికీ అద్దాల్లోంచి బయటకు వచ్చి ఎమర్జెన్సీ విండో బద్దలు కొట్టి పిల్లల్ని కాపాడారు. స్కూలు సిబ్బందికి స్థానికులు సహకరించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే తెలుస్తోంది.

Read Also : Pushpa 2 : పుష్ప 2 కన్నడలో రికార్డ్ బిజినెస్.. ఏ హీరో వల్ల కాలేదు..!

  Last Updated: 28 Jun 2024, 11:59 AM IST