US Road Accident: అమెరికాలోని ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కారు యాక్సిడెంట్‌కు గురికావడంతో చనిపోయిన వారిని ప్రగతి రెడ్డి (35), ఆమె కుమారుడు అర్విన్ (6), ప్రగతి అత్త సునితా రెడ్డి (56)లుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ప్రగతి, ఆమె భర్త రోహిత్, వారి ఇద్దరు కుమారులు, రోహిత్ తల్లి సునిత ఉన్నారు. కారుకు యాక్సిడెంట్ జరిగిన వెంటనే ప్రగతి, అర్విన్, సునిత అక్కడికక్కడే చనిపోయారు. కారును డ్రైవింగ్ చేస్తున్న రోహిత్, ఆయన చిన్న కుమారుడు మాత్రమే గాయాలతో బతికి బయటపడ్డారు.
Also Read :Gold Loan Renewal : గోల్డ్ లోన్ రెన్యూవల్.. కొత్త అప్‌డేట్ తెలుసుకోండి
విషాదంలో బాధిత కుటుంబం..
బాధిత కుటుంబీకులంతా రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లి వాస్తవ్యులు(US Road Accident). ప్రగతి రెడ్డి విషయానికొస్తే.. ఆమె టేకులపల్లి మాజీ ఎంపీటీసీ మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పవిత్రాదేవి దంపతుల కుమార్తె. సిద్దిపేట సమీపంలోని బక్రి చప్రియాల్‌కు చెందిన రోహిత్‌రెడ్డితో ప్రగతి రెడ్డికి పెళ్లయింది. వారికి ఇద్దరు కుమారులు. రోహిత్‌రెడ్డి తల్లి సునీత కూడా వారితో పాటు అమెరికాలోనే ఉంటున్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో రోహిత్ రెడ్డి తన తల్లి, భార్య, ఆరేళ్ల కొడుకును కోల్పోయారు. ఈ దుర్వార్త తెలియడంతో ప్రగతి తల్లిదండ్రులు మోహన్, పవిత్ర విషాదంలో మునిగిపోయారు. వారు వెంటనే అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ప్రగతి, అర్విన్, సునితల అంత్యక్రియలను ఫ్లోరిడాలోనే నిర్వహిస్తారని తెలిసింది.
Also Read : Grok Vs Telugu Words : ‘గ్రోక్’తో గోక్కుంటున్న తెలుగు నెటిజన్లు
జాన్వీ వ్యాఖ్యలు వైరల్
గుజరాత్‌లోని వడోదరలో ఉన్న కరేలీబాగ్ ప్రాంతంలో 20 ఏళ్ల లా స్టూడెంట్ రక్షిత్ చౌరాసియా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో కారును నడిపాడు. ఐదుగురిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ స్పందించారు. ‘‘ఈప్రమాదం నాకు బాధ కలిగించింది. ర్యాష్ డ్రైవింగ్ చేసిన వ్యక్తి తాగి ఉన్నా లేకపోయినా, అతడిని సహించలేం’’ అని ఆమె వ్యాఖ్యానించింది. జాన్వీ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.