Site icon HashtagU Telugu

Road Accident : భూపాలపల్లి జిల్లాలో పొగమంచు కారణంగా ఆర్టీసీ బస్సు..డీసీఎం ఢీ..

Road Accident In Bhupalpall

Road Accident In Bhupalpall

గత కొద్దీ రోజులుగా తెలంగాణ లో చలి వణికిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అలాగే ఉదయం 8 దాటే వరకు కూడా పొగమంచు వీడడం లేదు. దీంతో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పొగమంచు లో ఎదురుగా వచ్చే వాహనాలకు కనిపించకపోయేసరికి ఢీ కొట్టుకుంటున్నాయి. తాజాగా ఈరోజు ఉదయం భూపాలపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు..డీసీఎం ఢీ కొట్టుకోగా..డీసీఎం వ్యాన్ డ్రైవర్ మృతి చెందగా బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join.

రేగొండ మండలం భాగిర్తిపేట- కొత్తపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. దట్టమైన పొగమంచు ప్రబావంతో ఆర్టీసీ బస్సు – డీసీఎం వ్యాన్ ఎదురెదురుగా డీకొన్నాయి. డీసీఎం వ్యాన్ డ్రైవర్ మృతి చెందగా బస్సు డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడం తో వారిని వెంటనే 108 ద్వారా హాస్పిటల్ తరలించారు. ఆర్టీసీ బస్సు భూపాలపల్లి నుంచి హన్మకొండ కు వెళ్తుండగా .. డీసీఎం వ్యాన్ భూపాలపల్లికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై దట్టమైన పొగ మంచు కమ్ముకోవడంతో రెండు వాహనాలు ఎదురెదుగా వచ్చి ఢీ కొట్టాయని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.

Read Also : Congress: 2024 లోక్‌సభ ఎన్నికలు.. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయనున్న రాష్ట్రాలు ఇవే..!