Site icon HashtagU Telugu

RK Rule : తెలంగాణలో ఆర్కే పాలన అంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..అసలు ఎవరు ఆర్కే..?

BRS leaders are responsible for Kaleshwaram corruption: Bandi Sanjay

BRS leaders are responsible for Kaleshwaram corruption: Bandi Sanjay

కేంద్ర మంత్రి మరియు బీజేపీ నాయకులు బండి సంజయ్ కుమార్ తెలంగాణ రాజకీయాలపై, ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతిని తాను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో ప్రస్తుత పాలనను ‘ఆర్కే రూల్’గా అభివర్ణించారు. అంటే రేవంత్ రెడ్డి (R) మరియు కేటీఆర్ (K) పాలన కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనంటూ ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి వచ్చిన తర్వాత ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడే వారిని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని, కచ్చితంగా చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

Maa Lakshmi Blessings: ఇంటి నుంచి లక్ష్మీదేవిని దూరం చేసే అలవాట్లు ఇవే!

అర్బన్ నక్సల్స్ మరియు కమ్యూనిస్టు పార్టీలపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించలేని కబోధులుగా వారిని అభివర్ణించారు. అమాయకులను రెచ్చగొట్టి ఆయుధాలు చేతపట్టించి, వారి చావులకు కారకులైన అర్బన్ నక్సల్స్ సాధించిందేమీ లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వంద రోజుల ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించిన ఆయన, అటువంటి ప్రభుత్వానికి కమ్యూనిస్టులు ఎందుకు మద్దతిస్తున్నారని, ప్రభుత్వంలో భాగస్వాములయ్యారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టులకు ఏమాత్రం నైతికత ఉన్నా, ప్రభుత్వంలో తమకున్న పదవులకు రాజీనామా చేసి బయటకు వచ్చి వాస్తవాలు మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు.

Naga Chaitanya: NC24 నుంచి బిగ్ అప్డేట్‌.. మేకింగ్ వీడియో విడుద‌ల‌!

బండి సంజయ్ అర్బన్ నక్సల్స్ యొక్క ద్వంద్వ నీతిని ప్రశ్నించారు. నగరాల్లోని ఏసీ రూముల్లో ఉంటూ బూటకపు ఎన్‌కౌంటర్ల గురించి మాట్లాడే కమ్యూనిస్టులు, నక్సలిజంలో చేరినవారు లొంగిపోవాలని ఎన్నడైనా చెప్పారా అని నిలదీశారు. ఒకవైపు రాజ్యాంగాన్ని కాపాడాలని ఆందోళనలు చేస్తూ, అదే రాజ్యాంగానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టి నక్సలిజంలో చేరాలని అమాయకులను రెచ్చగొట్టడం ఏం సిద్ధాంతమని ప్రశ్నించారు. దీనికి భిన్నంగా, బీజేపీకి స్పష్టమైన లక్ష్యం ఉందని, బ్యాలెట్‌ను నమ్ముకుని కేంద్రంలో వరుసగా అధికారంలోకి వచ్చిందని, 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యంతో 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా మార్చడానికి తాము ముందుకు సాగుతున్నామని చెబుతూ, మరి అర్బన్ నక్సల్స్ మరియు కమ్యూనిస్టుల లక్ష్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

Exit mobile version