Final Journey: ముగిసిన మాజీ సీఎం రోశ‌య్య అంత్య‌క్రియ‌లు.. క‌న్నీటి వీడ్కోలు ప‌లికిన నేత‌లు

మాజీ ముఖ్య‌మంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు పూర్తైయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు.

  • Written By:
  • Updated On - December 5, 2021 / 07:29 PM IST

మాజీ ముఖ్య‌మంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు పూర్తైయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. రోశయ్య అంత్యక్రియలకు ప‌లువురు రాజ‌కీయ ప్రముఖులు హాజ‌రైయ్యారు. రోశ‌య్య‌ను క‌డ‌సారి చూసేందుకు భారీగా ప్ర‌జ‌లు,అభిమానులు త‌ర‌లివ‌చ్చారు. రోశయ్య శనివారం ఉదయం మ‌ర‌ణించారు. ఉద‌యం ఆయ‌న‌కు అస్వ‌స్థ‌గా ఉండ‌టంతో వెంటనే బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-10లోని స్టార్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.

రోశయ్య పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆయ‌న నివాసంలో ఉంచారు. అనంత‌రం గాంధీభవన్ కి తీసుకువ‌చ్చారు. గాంధీభ‌వ‌న్ లో ఏఐసీసీ నేత మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, టీపీసీసీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆయ‌న భౌతికకాయానికి నివాళ్లు అర్పించారు. అనంత‌రం అక్క‌డి నుంచి దేవరయాంజల్‌లోని వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. రోశయ్య మృతిపై తెలంగాణ , ఏపీ ప్ర‌భుత్వాలు మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించించాయి.