Rich BRS : ఏడాదిలో 5 రెట్ల ఆదాయం! ఖాతాలో రూ. 218 కోట్లు, కంట్రీ నెంబ‌ర్ 1

కేసీఆర్ పార్టీ ఒక్క ఏడాదిలో ఐదు రెట్ల ఆదాయం పెంచుకుంది. ఎన్నిక‌ల క‌మిష‌న్ కు

  • Written By:
  • Updated On - December 27, 2022 / 05:31 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ ఒక్క ఏడాదిలో ఐదు రెట్ల ఆదాయం పెంచుకుంది. ఆ మేర‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్(EC) కు బీఆర్ఎస్ (Rich BRS) పార్టీ అంద‌చేసిన ఆడిట్ రిపోర్ట్‌- 2022లో పేర్కొంది. గ‌త ఏడాది గతేడాది మార్చి 31 నాటికి టీఆర్ఎస్ ఖాతాలో రూ. 37.65 కోట్లు ఉంది. అదే ఏడాది తిరిగే సరికి రూ. 218.11 కోట్లకు చేరింది. ఈ ఏడాది మార్చి 31నాటికి ఆదాయ లెక్కలను బీఆర్ఎస్(Rich BRS) కేంద్ర ఎన్నికల సంఘానికి(EC) అంద‌చేసిన లెక్క‌ల్లో రిచ్చెస్ట్ పార్టీగా నిలిచింది.

Also Read : BRS MLAs Secret Meeting: ఎమ్మెల్యేల రహస్య భేటీ.. బీఆర్ఎస్ లో హైడ్రామా

ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఏకంగా రూ. 153 కోట్ల ఆదాయం సమకూరిందని బీఆర్ఎస్ తెలిపింది. ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రూ. 40 కోట్లు వచ్చాయని, ఇతర ఆదాయాల రూపంలో రూ. 16 కోట్లు సమకూరినట్టు నివేదిక‌లో వివ‌రించింది. ఏడాది కాలంలో రూ. 27.93 కోట్ల ఖర్చు అయినట్టు వెల్లడించింది. మొత్తంగా రూ. 190 కోట్ల నికర ఆదాయం లభించిందని తేల్చింది. మొత్తంగా బీఆర్ ఎస్ ఆస్తుల విలువ రూ. 480.75 కోట్లకు చేరుకుందని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం పార్టీ ఆస్తుల విలువ రూ. 288.24 కోట్లు ఉండగా ఏడాది తిరిగే సరికి రెట్టింపు అవడం రాజ‌కీయ చ‌రిత్ర‌లో కేసీఆర్ చాణ‌క్యం చెర‌ప‌లేనిది.

టీఆర్ఎస్ (Rich BRS) సుసంపన్నమైన పార్టీ

ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న‌ టీఆర్ఎస్ (TRS) సుసంపన్నమైన పార్టీగా ఆవిర్భవించిందని గ‌త ఏడాది ప్లీన‌రీలో చీఫ్ కేసీఆర్ ప్ర‌క‌టించారు. టీఆర్ఎస్ పార్టీకి నిధుల కొరత లేదని వెల్లడించారు. జాతీయ పార్టీ పెట్ట‌డానికి నిధుల‌ను భారీగా వ‌స్తాయ‌ని అప్ప‌ట్లోనే కేసీఆర్ అంచ‌నా వేశారు. టీఆర్ఎస్ పార్టీ దగ్గర రూ. 865 కోట్ల నిధులు ఉన్నాయని గ‌త ప్లీన‌రీ వేదిక‌గా కేసీఆర్ ప్ర‌క‌టించారు. ప్రతి నెల 3.84 కోట్ల వడ్డీ వస్తోందని లెక్క చెప్పారు. కేవ‌లం ఆ వడ్డీ డబ్బు మాత్ర‌మే రూ. 24 కోట్లు దాటిందని అన్నారు. ఆ నిధుల‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఫిక్స్ డిపాజిట్ చేశామ‌ని గ‌త ఏడాది వెల్ల‌డించారు. టీఆర్ఎస్‌కు సంబంధించిన ఢిల్లీ, హైదరాబాద్, జిల్లా, కార్యాలయాల ఆస్తుల విలువ వెయ్యి కోట్లకుపైనే ఉంటుందని కేసీఆర్ స‌గ‌ర్వంగా ప్ర‌క‌టించారు. దానికి అద‌నంగా ఏడాది తిర‌క్కుండానే ఐదింత‌ల నిధులు పెరిగిన‌ట్టు తాజాగా ఎన్నిక‌ల క‌మిష‌న్ కు బీఆర్ఎస్ త‌ర‌పున తెలియ‌చేయ‌డం గ‌మ‌నార్హం.

జాతీయ పార్టీగా బీఆర్ఎస్

దేశంలో కొన్ని వేళ రిజిస్ట్ర‌ర్ పార్టీలు ఉన్నాయి. ప‌దుల సంఖ్య‌లో మాత్ర‌మే గుర్తింపు పొందిన పార్టీలు ప్ర‌జ‌ల‌కు తెలుసు. ఇక జాతీయ పార్టీల సంఖ్య నానాటికీ త‌గ్గిపోతోంది. ఎన్నిక‌ల క‌మిష‌న్ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ప్ర‌జా ఆద‌ర‌ణ పొంద‌లేని పార్టీల‌ను జాతీయ పార్టీల గుర్తింపు నుంచి తొల‌గించ‌డం ఆన‌వాయితీ. ఆ జాబితాలో క‌మ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. ఇలాంటి త‌రుణంలో కేసీఆర్ జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ను తీర్చిదిద్ద‌డానికి రంగంలోకి దిగారు. నిధుల‌ను మాత్ర‌మే జాతీయ పార్టీల‌కు మించిన విధంగా పెంచారు.

Also Read : Richest MP : దేశంలో నెం1 ధనిక ఎంపీ

ప్ర‌తి పార్టీ డొనేష‌న్ల‌ను తీసుకుంటుంది. దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీకి టీఆర్ఎస్ కు ఉన్న‌న్ని నిధులు స‌మ‌కూర‌లేదు. ప్ర‌తి ఏడాది ఆయా పార్టీల నిధుల వివ‌రాల‌ను ఎన్నిక‌ల క‌మిష‌న్ విడుద‌ల చేయ‌డం స‌హ‌జం. కానీ, ఇటీవ‌ల టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా కేసీఆర్ మార్చేశారు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీ సంప‌ద‌ను ఆడిట్ చేయించారు. ఆ నివేదిక‌ను ఎన్నిక‌ల క‌మిష‌న్ కు అంద‌చేశారు. దాని ప్ర‌కారం ప్ర‌ధాన జాతీయ పార్టీల‌కు ఏ మాత్రం త‌క్కువ కాకుండా సంప‌ద‌ను పోగుచేసుకుంది. కార్పొరేట్ విరాళాల‌ను సేక‌రించ‌డం ప్ర‌తి పార్టీ చేస్తోంది. ఆ విష‌యంలో కేసీఆర్ బాగా ముందున్నారు. దేశంలోని ఏ పార్టీకి ల‌భించ‌న‌న్న నిధుల‌ను బీఆర్ఎస్ కు రావ‌డం వెనుక గుట్టు ఆ దేవుడికే ఎరుక‌. !

Also Read : BRS : ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ కార్యాలయం.. జనవరిలో ప్రారంభం!