Site icon HashtagU Telugu

CM Revanth Reddy : ఆల్ టైమ్ బెస్ట్ సీఎంగా రేవంత్ అవుతారు – వర్మ

Rgv Revanth

Rgv Revanth

తెలంగాణ నూతన సీఎం గా రేవంత్ రెడ్డి ఎన్నికైన సంగతి తెలిసిందే. రేపు హైదరాబాద్ లోని LB స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలతో పాటు పలువురు పార్టీల నేతలు హాజరుకాబోతున్నారు. ఇక రేవంత్ ను కాంగ్రెస్ అధిష్టానం సీఎం గా ప్రకటించినప్పటి నుండి పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తెలుపగా..తాజాగా రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా ఆల్ టైమ్ బెస్ట్ సీఎంగా రేవంత్ అవుతారు అంటూ ప్రశంసలు కురిపించారు.

ఎంతో జ్ఞానం ఉన్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేశారని .. రేవంత్ గురించి, ఆయన శక్తి గురించి, ఆయన ఆలోచనల్లో పదును గురించి తెలిసిన వ్యక్తిగా చెపుతున్నా… ఆల్ టైమ్ బెస్ట్ సీఎంగా రేవంత్ అవుతారని చెప్పడంలో తనకు ఎలాంటి సందేహం లేదని అన్నారు. నో డౌట్ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటె రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సంబదించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సీఎంతో పాటు 9 నుంచి 18 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని సమాచారం. రేపు మధ్యాహ్నం ఒంటి గంటా 4 నిమిషాలకు రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Exit mobile version